మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కోర్టు మెట్లెక్కనున్నారు. ఆన్‌లైన్ సెర్చ్, వ్యాపార ప్రకటనలలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ దాఖలైన పిటిషన్‌పై అమెరికా న్యాయ శాఖ విచారణ చేపట్టనుంది. ఇందులో భాగంగా నిజానిజాలు వెల్లడించేందుకు సత్య నాదెళ్ల (సెప్టెంబర్ 2న)కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమెరికా ప్రభుత్వ, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు గూగుల్ అనైతిక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందంటూ ఆరోపిస్తున్నాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ యాప్‌ను తమ టాప్‌లో ఆయా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుంది.
ఆ ఒప్పందం మేరకు, యాపిల్, టెలికం దిగ్గజం ఎటీ అండ్ టీ (AT&T) సంస్థలకు ఏడాదికి 10 బిలియన్ డాలర్లు చెల్లించినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. గూగుల్ విడుదల చేసే యాప్ టాప్‌లో ఉండడం వల్ల యూజర్ల వినియోగం పెరిగి..వాటి ద్వారా ఆదాయం గడించిందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్లతో పాటు
అయితే, గూగుల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు అమెరికా న్యాయ శాఖ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్లతో పాటు టాప్ ఎగ్జిక్యూటీవ్‌ల నుంచి సాక్ష్యాల్ని సేకరించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్ ఎడ్జ్, బింగ్ బ్రౌజర్‌ల విస్తరణ, గూగుల్ ఆధిపత్యం వల్ల ఎదురవుతున్న అడ్డంకులు గురించి అడగనుంది.
రద్దయిన మైక్రోసాఫ్ట్ - యాపిల్ ఒప్పందం
బింగ్ సెర్చ్ యాప్‌లో యాపిల్ యాప్స్ డిస్‌ప్లే అయ్యేలా మైక్రోసాఫ్ట్- యాపిల్ మధ్య ఒప్పందం జరిగింది. కానీ ఆ డీల్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో అమెరికా న్యాయ శాఖ మైక్రోసాఫ్ట్ బిజినెస్ డెవెలప్‌మెంట్ ఎగ్జిక్యూటీవ్ జాన్తన్ టింటర్‌ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా యూజర్లు డీఫాల్ట్‌గా మరో సెర్చ్ ఇంజిన్‌ను (బింగ్) వినియోగించేందుకు వీలు లేకుండా గూగుల్ చేసిందన్న విషయాన్ని వెల్లడించారు.
పరిమితులు విధించింది
ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు లైసెన్స్ ఇవ్వాలంటే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యుయో స్మార్ట్‌ఫోన్ గూగుల్ సెర్చ్‌ను ఉపయోగించాల్సి ఉందని, కానీ తన సొంత యాప్స్‌లలో బింగ్‌ను ఉపయోగించకుండా పరిమితులు విధించిందని టింటర్ కోర్టుకు తెలిపారు.
చదవండి👉‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment