CEO Satya Nadella
-
భారీగా పెరిగిన మైక్రోసాఫ్ట్ సీఈవో ప్యాకేజీ
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వేతన ప్యాకేజీ భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆయన ఆర్థిక పరిహారం 63% పెరిగి 79.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.665 కోట్లు) చేరుకుంది. ఈ మేరకు తాజా ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.సత్య నాదెళ్ల ప్యాకేజీ ఈ స్థాయిలో పెరగడానికి ఆయన స్టాక్ అవార్డులు సహాయపడ్డాయి. 2023లో ఆయన 48.5 మిలియన్ డాలర్ల పరిహారం అందుకున్నారు. ఇందులో స్టాక్ అవార్డుల విలువ 39 మిలియన్ డాలర్లు. 2024లో సత్య నాదెళ్ల స్టాక్ అవార్డుల రూపంలో సంపాదించినది 71 మిలియన్ డాలర్లు.జూన్‌తో ముగిసిన 2024 ఆర్థిక సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ షేర్లు దాదాపు 31.2% లాభపడ్డాయి. కంపెనీ మార్కెట్ విలువ 3 ట్రిలియన్ డాలర్లు దాటింది. సత్య నాదెళ్ల ప్యాకేజీ భారీగా పెరిగినప్పటికీ ఆయన నగదు ప్రోత్సాహకం మాత్రం సగానికి తగ్గింది. గతంలో 10.7 మిలియన్ డాలర్లకు అర్హత పొందిన ఆయన అనేక సైబర్ సెక్యూరిటీ ఉల్లంఘనల కారణంగా 5.2 మిలియన్ డాలర్లకు తగ్గించుకోవాల్సి వచ్చింది.ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ నుంచి ఎక్కువగా వెళ్లిపోతున్నది మహిళలే..ఇక ఇతర హై-ప్రొఫైల్ టెక్ బాస్‌లలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2023లో 63.2 మిలియన్ డాలర్లు సంపాదించారు. ఏఐ-చిప్ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ 2024 ఆర్థిక సంవత్సరంలో 34.2 మిలియన్ డాలర్ల ప్యాకేజీ అందుకున్నారు. -
Microsoft: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై రెండేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు నైపుణ్యం కల్పిస్తామని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల బుధవారం తెలిపారు. శ్రామికశక్తి అభివృద్ధి చెందడానికి నైపుణ్యాలను పెంపొందించడం అనేది ఒక సంస్థ చేయగలిగే అత్యంత ముఖ్యమైన విషయమని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నాదెళ్ల భారత్‌లో అడుగుపెట్టారు. కన్సల్టెన్సీలు, చట్టపర సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐపై నిబంధనలను రూపొందించడంలో భారత్, యూఎస్ సహకరించుకోవడం అత్యవసరం అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కొత్త తరం సాంకేతికత వృద్ధిని సమానంగా పంపిణీ చేయగలదని అన్నారు. శక్తివంతమైన సాధారణ ప్రయోజన సాంకేతికతగా ఏఐని పేర్కొన్న ఆయన.. ఏఐ నిబంధనల విషయంలో ఏకాభిప్రాయం బహుపాక్షిక స్థాయిలలో కూడా చాలా అవసరమని నాదెళ్ల తెలిపారు. జీడీపీ వృద్ధిలో ఏఐ.. సాంకేతికత వేగంగా విస్తరించడం వల్ల ఆర్థిక వృద్ధిలో సమాన పంపిణీకి సహాయపడుతుందని సత్య నాదెళ్ల అన్నారు. జీడీపీ వృద్ధిని పెంచడంలో ఏఐ సహాయపడుతుందని చెప్పారు. భారత్‌ను ప్రపంచంలోని అత్యధిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా పేర్కొన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో ఏఐ జీడీపీ 500 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న మినిస్ట్రీ ఆఫ్ ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నివేదికను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ కూడా గ్రిడ్ స్థిరత్వంపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. సాంకేతికత కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. భారత పర్యటనలో భాగంగా టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌ను తాను కలిశానని, ఎయిర్ ఇండియా ఏఐ వినియోగాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఐటీసీ, అరవింద్, లాభాపేక్ష లేని ఇతర భారతీయ సంస్థలు, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వంటి ఐటీ కంపెనీలు అనేక సంస్థాగత కార్యక్రమాల కోసం ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నాయని నాదెళ్ల వివరించారు. -
ఓపెన్ఏఐ వద్దంటే.. మైక్రోసాఫ్ట్ రమ్మంది!
సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది. కంపెనీ 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించిన వెంటనే సంస్థ కో-ఫౌండర్, ప్రెసిడెంట్ 'గ్రెగ్ బ్రాక్‌మన్' తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్ (ట్విటర్) ద్వారా ప్రకటించారు. ఒకే రోజులు జరిగిన ఈ సంఘటనలు టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోయింది. ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన తరువాత ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft)లో వారిద్దరూ (శామ్ ఆల్ట్‌మన్ & గ్రెగ్ బ్రాక్‌మన్) ఎమ్మెట్ షియర్ అండ్ ఓఏఐ (Emmett Shear and OAI) కొత్త బృందానికి నాయకత్వం వహించనున్నట్లు సీఈఓ 'సత్య నాదెళ్ళ' తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: సీఈఓను తొలగించిన వెంటనే.. ప్రెసిడెంట్ రాజీనామా - ట్వీట్ వైరల్ ఓపెన్ఏఐతో మా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని.. శామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్‌లో చేరబోతున్నారనే వార్తను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని.. వారి విజయాలకు అవసరమైన వనరులను అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని సత్య నాదెళ్ల వెల్లడించారు. We remain committed to our partnership with OpenAI and have confidence in our product roadmap, our ability to continue to innovate with everything we announced at Microsoft Ignite, and in continuing to support our customers and partners. We look forward to getting to know Emmett… — Satya Nadella (@satyanadella) November 20, 2023 -
సాక్ష్యం చెప్పేందుకే.. కోర్టు మెట్లెక్కిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కోర్టు మెట్లెక్కనున్నారు. ఆన్లైన్ సెర్చ్, వ్యాపార ప్రకటనలలో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తుందంటూ దాఖలైన పిటిషన్‌పై అమెరికా న్యాయ శాఖ విచారణ చేపట్టనుంది. ఇందులో భాగంగా నిజానిజాలు వెల్లడించేందుకు సత్య నాదెళ్ల (సెప్టెంబర్ 2న)కోర్టుకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా ప్రభుత్వ, ప్రభుత్వ నియంత్రణ సంస్థలు గూగుల్ అనైతిక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుందంటూ ఆరోపిస్తున్నాయి. గూగుల్ సెర్చ్ ఇంజిన్ యాప్‌ను తమ టాప్‌లో ఆయా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుంది. ఆ ఒప్పందం మేరకు, యాపిల్, టెలికం దిగ్గజం ఎటీ అండ్ టీ (AT&T) సంస్థలకు ఏడాదికి 10 బిలియన్ డాలర్లు చెల్లించినట్లు అనుమానం వ్యక్తం చేస్తుంది. గూగుల్ విడుదల చేసే యాప్ టాప్‌లో ఉండడం వల్ల యూజర్ల వినియోగం పెరిగి..వాటి ద్వారా ఆదాయం గడించిందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్లతో పాటు అయితే, గూగుల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు అమెరికా న్యాయ శాఖ మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యానాదెళ్లతో పాటు టాప్ ఎగ్జిక్యూటీవ్‌ల నుంచి సాక్ష్యాల్ని సేకరించేందుకు సిద్ధమైంది. అదే సమయంలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన సెర్చ్ ఇంజిన్ ఎడ్జ్, బింగ్ బ్రౌజర్ల విస్తరణ, గూగుల్ ఆధిపత్యం వల్ల ఎదురవుతున్న అడ్డంకులు గురించి అడగనుంది. రద్దయిన మైక్రోసాఫ్ట్ - యాపిల్ ఒప్పందం బింగ్ సెర్చ్ యాప్‌లో యాపిల్ యాప్స్ డిస్ప్లే అయ్యేలా మైక్రోసాఫ్ట్- యాపిల్ మధ్య ఒప్పందం జరిగింది. కానీ ఆ డీల్ ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో అమెరికా న్యాయ శాఖ మైక్రోసాఫ్ట్ బిజినెస్ డెవెలప్మెంట్ ఎగ్జిక్యూటీవ్ జాన్తన్ టింటర్ను ప్రశ్నించింది. ఈ సందర్భంగా యూజర్లు డీఫాల్ట్‌గా మరో సెర్చ్ ఇంజిన్‌ను (బింగ్) వినియోగించేందుకు వీలు లేకుండా గూగుల్ చేసిందన్న విషయాన్ని వెల్లడించారు. పరిమితులు విధించింది ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు లైసెన్స్ ఇవ్వాలంటే మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యుయో స్మార్ట్‌ఫోన్ గూగుల్ సెర్చ్‌ను ఉపయోగించాల్సి ఉందని, కానీ తన సొంత యాప్స్‌లలో బింగ్‌ను ఉపయోగించకుండా పరిమితులు విధించిందని టింటర్ కోర్టుకు తెలిపారు. చదవండి👉‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే? -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు సీఈవో సత్య నాదెళ్ల. ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం అందించారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలకు కోత పెట్టిన ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు ఉద్యోగుల జీతాల పెంపునకు కోత పెట్టింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! ఓ వైపు లేఆఫ్స్ కొనసాగుతున్నప్పటికీ ఇటీవలి త్రైమాసికాల్లో మైక్రోసాఫ్ట్ మంచి లాభాలనే నమోదు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి జీతాల పెంపు కచ్చితంగా ఉంటుందని ఉద్యోగులు కొండంత ఆశతో ఉన్నారు. అయితే ఈ ఏడాది జీతాల పెంపు ఉండదని సీఈవో సత్య నాదెళ్ల తేల్చి చెప్పేశారు. కోవిడ్ సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ సంవత్సరం జీతాల పెంపు ఉండదని, ఈ అనిశ్చిత సమయాల్లో తమ వ్యాపారం, ఉద్యోగుల స్థిరత్వాన్ని నిర్ధారించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. జీతాల పెంపు లేనప్పటికీ బోనస్‌లు, స్టాక్ అవార్డుల ద్వారా ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. తమ ఉద్యోగులకు వృద్ధి, ఎదుగుదలకు అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఆన్లైన్ విక్రయాలపై దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్న నేపథ్యంలో రిటైల్ స్టోర్లలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందన్న వార్తలకు బలం చేకూరుతోంది. తొలగింపులు ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులందరిపైనా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ జీతాల పెంపును స్తంభింపజేయడం టెక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లకు సంకేతం. ఇటీవలి కాలంలో లేఆఫ్స్, జీతాల పెంపు నిలిపివేత, వేతనాల తగ్గింపు వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఏకైక టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు. జనవరిలో ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా 3,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ కూడా నియామకాల వేగాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు -
140 ఏళ్లు బతికేస్తాం..!
దావోస్: ఆరోగ్యరంగంలో చోటుచేసుకుంటున్న అత్యాధునిక సాంకేతిక మార్పుల కారణంగా మనిషి ఆయుర్దాయం 140 ఏళ్లకు పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరి కొన్ని దశాబ్దాల్లోనే ఇది సాకారం కానుందన్నారు. కృత్రిమ మేథ సహకారంతో చికిత్సా విధానాల్లో విప్లవాత్మక మార్పులు జరగనున్నాయన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు నేపథ్యంలో ‘ఆరోగ్యరంగాన్ని మారుస్తున్న నాలుగోతరం పారిశ్రామిక విప్లవం’ పేరుతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. ‘ఆరోగ్యరంగంలో కృత్రిమ మేథను వినియోగించడం వల్ల వైద్య నిపుణులు త్వరితగతిన, అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు’ అని తెలిపారు. కొత్త టెక్నాలజీ వల్ల ఆస్పత్రి నిర్వహణ రూపురేఖలే మారిపోతాయనీ, సిబ్బంది సంఖ్యతో పాటు ఆస్పత్రి ఖర్చులు భారీగా తగ్గిపోతాయని వెల్లడించారు. మెడిసిన్, సాంకేతికతల కలయికతో ప్రపంచం మరింత ఆరోగ్యకరంగా మారుతుందని పేర్కొన్నారు. ‘రాబోయే కొన్ని దశాబ్దాల్లో మనుషుల సగటు ఆయుఃప్రమాణం 140 ఏళ్లకు చేరుకుంటుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం పౌరుల బాధ్యతగా మారడంతో ఆస్పత్రులు కేవలం నామమాత్రంగా మారుతాయి. ప్రమాదానికి గురయ్యే రోగిని ఆస్పత్రికి తరలించేలోపే అంబులెన్సులోని వైద్య సిబ్బంది రోగి ఆరోగ్యచరిత్రను 5జీ టెక్నాలజీ సాయంతో వేగంగా సేకరించి చికిత్సను ప్రారంభిస్తారు’ అని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నిపుణులు తెలిపారు. శరీరంలో కార్టిసాల్, గ్లూకోజ్ స్థాయిల్లో ఏమాత్రం తేడా వచ్చినా హెచ్చరించే పరికరాలను రూపొందిస్తున్నట్లు నోకియా సంస్థ అధ్యక్షుడు రాజీవ్ సూరీ వెల్లడించారు. సాంకేతికత సాయంతో నాణ్యమైన మందుల్ని వేగంగా రోగులకు అందించగలమనీ, వ్యాధుల్ని కూడా చాలాముందుగానే పసిగట్టగలమని పేర్కొన్నారు. -
ప్రపంచాన్ని బలోపేతం చేయడమే మైక్రోసాఫ్ట్ మిషన్: సత్య
ప్రపంచాన్ని బలోపేతం చేయడమే మైక్రోసాఫ్ట్ మిషన్ అని వెల్లడి న్యూయార్క్: ప్రపంచాన్ని శక్తిమంతం చేయాలని మైక్రోసాఫ్ట్ కోరుకుంటున్నట్టు ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల చెప్పారు. ప్రతీ వ్యక్తీ, ప్రతీ సంస్థ మరింత సాధించేందుకు వీలుగా వారిని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నామని, ఇదే మైక్రోసాఫ్ట్ మిషన్ అని ఆయన చెప్పారు. దీన్ని పూర్తి చేసేందుకు మైక్రోసాఫ్ట్ ప్రతీ ఒక్కరిలా, ప్రతి సంస్థలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన టాండన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులు, అధ్యాపకవర్గంతో ఇటీవల సత్యనాదెళ్ల సమావేశమయ్యారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కంపెనీ పనితీరును మార్చేందుకు తీసుకున్న చర్యలపై ఓ విద్యార్థి నుంచి సత్యకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన స్పందిస్తూ... మైక్రోసాఫ్ట్ మిషన్ గురించి తెలియజేశారు. దీన్ని సాధించేందుకు వైవిధ్యం, సమగ్రత అనేవి చాలా కీలకమని పేర్కొన్నారు. కంపెనీ వ్యాప్తంగా వైవిధ్యం, సమగ్రత అనే సంస్కృతిని అభివృద్ధి చేయాల్సి ఉందని, దీన్ని సాధించేందుకు మైక్రోసాఫ్ట్ కష్టించి పనిచేస్తోందని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వేర్పాటువాద, వలసవాద వ్యతిరేక విధానాల నేపథ్యంలో సత్యనాదెళ్ల వైవిధ్యం, కలసి సాగాల్సిన అవసరం గురించి చెప్పడం విశేషం. -
సత్య నాదెళ్లకు మీరా స్ఫూర్తి?
- సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం - పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ సాక్షి, హైదరాబాద్: స్వయంకృషితో అత్యున్నత స్థానానికి ఎదిగిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లకు తానే స్ఫూర్తిని ఇచ్చానని సీఎం చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనూ, దేశవిదేశాల్లోనూ ఎవరు ఏ ఘనత సాధించినా ఆ విజయం సొంతం చేసుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతూ ఉంటారని బుగ్గన విమర్శించారు. సత్య నాదెళ్ల కెరీర్‌ను చూస్తే బాబు చెప్పేది అబద్ధమని తెలుస్తుందన్నారు. 1988లో మణిపాల్ వర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకున్న సత్య అమెరికా వెళ్లి అక్కడే ఎమ్మెస్, ఎంబీఏ చదివి 1990లో సన్ మైక్రోసిస్‌లో చేరారన్నారు. మైక్రోసాఫ్ట్‌లో1992లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈవో అయ్యారన్నారు. ఇక సత్య తండ్రి బి.ఎన్.యుగంధర్ (ఐఏఎస్ అధికారి) తన వద్దే పని చేశారని బాబు చెప్పుకోవడం మరీ వింత అన్నారు.యుగంధర్ రాష్ట్రంలో చివరిగా పని చేసింది 1986 నుంచి 88 వరకు అని, అప్పట్లో ఆయన పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా ఉన్నారన్నారు. చంద్రబాబు సీఎం అయిందే 1995లో అయినపుడు యుగంధర్ ఆయన దగ్గర పని చేశారని చెప్పడం వింతగా ఉందన్నారు. ఐటీ స్థానమెందుకు దిగజారింది..? ఐటీ అనే పదాన్ని తానే కనిపెట్టానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఐటీలో ఏపీ మూడో స్థానంలో ఉంటే 2004లో పదవి నుంచి దిగిపోయేనాటికి 5వ స్థానానికి ఎందుకు దిగజారిందని ప్రశ్నించారు. లోకేశ్ మాటేమిటి : ఎంతో మందికి స్ఫూర్తినిచ్చానని చెప్పుకున్న చంద్రబాబు నుంచి ఆయన కుమారుడు లోకేశ్ ఎందుకు స్ఫూర్తి పొందలేకపోయారో చెప్పాలని నిలదీశారు.