![Devdiscourse. Infosys and Microsoft to accelerate Ausgrid cloud transformation journey - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/14/INFOSYS-MICROSOFT12.gif.webp?itok=GSJtk5Jb)
న్యూఢిల్లీ: క్లౌడ్ ట్రాన్స్‌ఫార్మేషన్ సేవలు అందించేందుకు తాజాగా ఐటీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చేతులు కలిపాయి. తద్వారా ఆ్రస్టేలియా తూర్పుతీర ప్రాంతంలోని విద్యుత్ పంపిణీ దిగ్గజం ఆస్‌గ్రిడ్‌కు కొన్నేళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఇందుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తాము సమకూర్చనున్న సరీ్వసుల మద్దతుతో ఆస్‌గ్రిడ్ కస్టమర్లకు అందుబాటులో నమ్మకమైన నిరంతర సరీ్వసులను అందించేందుకు వీలుంటుందని ఇన్ఫోసిస్ పేర్కొంది.
40 లక్షలమంది ఆస్ట్రేలియన్లకు ప్రతిరోజూ అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్న అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవలసి ఉన్నట్లు ఆస్‌గ్రిడ్ సీఐవో నిక్ క్రోవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్‌వర్క్‌ను మరింత నమ్మదగిన స్థాయిలో మెరుగుపరుస్తామని, తద్వారా విద్యుత్ ధరలు తగ్గేందుకు వీలుంటుందన్నారు.
కొత్త సరీ్వసులను మార్కెట్లో చౌక గా, వేగవంతంగా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వెరసి క్లౌడ్ ప్రోగ్రామ్ ద్వారా ఆస్‌గ్రిడ్ వ్యయాల అదుపుతోపాటు.. ఐటీ వ్యవస్థ పనితీరు బలపడనున్నట్లు పేర్కొన్నారు. ఎంటర్‌ప్రైజ్ ఆధారిత క్లౌడ్ సరీ్వసుల వినియోగం పెరుగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఆ్రస్టేలియా ప్రధాన అధికారి రాచెల్ బాండీ అన్నారు. పలు బిజినెస్‌ల వృద్ధికి కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఇన్ఫోసిస్, ఆస్‌గ్రిడ్‌లతో జట్టుకట్టడం ద్వారా మైక్రోసాఫ్ట్ అజూర్ శక్తిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment