emergence
-
మరో వివాదంలో ఎమర్జెన్సీ.. కంగనకు కోర్టు నోటీసులు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదాల సుడిలో చిక్కుకుంది. . తాజాగా ఆమెకు చండీగఢ్‌లోని జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో సిక్కుల ప్రతిష్టను కించపరిచేలా నటించారని ఆరోపిస్తూ.. చండీగడ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్ రవీందర్ సింగ్ బస్సీ కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేశారు.అయితే సినిమాలను సిక్కు ప్రజలను అభ్యంతరకంగా చూపించారని, అనేక తప్పుడు సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కంగనపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కంగనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్5కు వాయిదా వేసింది.ఇక నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలో సిక్కులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని శిరోమణి అకాలీదళ్‌తో సహా పలు సిక్కు సంస్థలు ఆరోపించడంతో వివాదంలో చిక్కుకుంది.సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ కారణంగా ముంబైలోని తన ఆస్తిని బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని కంగనా ఇటీవల పేర్కొన్నారు. బాంద్రాలోని పాలి హిల్‌లో ఉన్న తన బంగ్లాను రూ. 32 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. -
ఘట్టాలు: భారతీయ పరిశ్రమల పితామహుడు
టాటా గ్రూపు ఆవిర్భావం: టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (టాటా గ్రూపు) ని జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా ముంబైలో స్థాపించారు. భారతదేశంలోని ప్రాచీన కంపెనీలలో టాటా ఒకటి. ఈ సంస్థ ప్రస్తుతం ఆరు ఖండాలలో 100 కు పైగా దేశాల్లో 2,46,000 మంది ఉద్యోగులతో తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. టాటా గ్రూపునకు ఇరవై లక్షలకు పైగా వాటాదారులు ఉన్నారు. సుమారు 57.7 బిలియన్లకు పైగా విలువైన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నాయి. రసాయనాలు, వినియోగదారుల ఉత్పత్తులు, ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సర్వీసెస్ మొదలైన వాటితో సహా అనేక ప్రాథమిక వ్యాపార రంగాలలో టాటా గ్రూపు వేళ్లూనుకుని ఉంది. టాటా గ్రూప్ స్థాపకుడిగా గుర్తింపు పొందిన జంషెట్జీ టాటాను ‘భారతీయ పరిశ్రమల పితామహుడు’గా అభివర్ణిస్తుంటారు. (చదవండి: లక్ష్యం 2047.. పరిశ్రమలు) -
ఆస్గ్రిడ్ కోసం ఇన్ఫీ, మైక్రోసాఫ్ట్ జత
న్యూఢిల్లీ: క్లౌడ్ ట్రాన్స్ఫార్మేషన్ సేవలు అందించేందుకు తాజాగా ఐటీ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చేతులు కలిపాయి. తద్వారా ఆ్రస్టేలియా తూర్పుతీర ప్రాంతంలోని విద్యుత్ పంపిణీ దిగ్గజం ఆస్గ్రిడ్కు కొన్నేళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఇందుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తాము సమకూర్చనున్న సరీ్వసుల మద్దతుతో ఆస్గ్రిడ్ కస్టమర్లకు అందుబాటులో నమ్మకమైన నిరంతర సరీ్వసులను అందించేందుకు వీలుంటుందని ఇన్ఫోసిస్ పేర్కొంది. 40 లక్షలమంది ఆస్ట్రేలియన్లకు ప్రతిరోజూ అత్యున్నత ప్రమాణాలతో అందిస్తున్న అత్యవసర సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దవలసి ఉన్నట్లు ఆస్గ్రిడ్ సీఐవో నిక్ క్రోవ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో నెట్‌వర్క్‌ను మరింత నమ్మదగిన స్థాయిలో మెరుగుపరుస్తామని, తద్వారా విద్యుత్ ధరలు తగ్గేందుకు వీలుంటుందన్నారు. కొత్త సరీ్వసులను మార్కెట్లో చౌక గా, వేగవంతంగా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. వెరసి క్లౌడ్ ప్రోగ్రామ్ ద్వారా ఆస్గ్రిడ్ వ్యయాల అదుపుతోపాటు.. ఐటీ వ్యవస్థ పనితీరు బలపడనున్నట్లు పేర్కొన్నారు. ఎంటర్ప్రైజ్ ఆధారిత క్లౌడ్ సరీ్వసుల వినియోగం పెరుగుతున్నట్లు మైక్రోసాఫ్ట్ ఆ్రస్టేలియా ప్రధాన అధికారి రాచెల్ బాండీ అన్నారు. పలు బిజినెస్‌ల వృద్ధికి కీలకంగా నిలుస్తున్నట్లు చెప్పారు. ఇన్ఫోసిస్, ఆస్గ్రిడ్లతో జట్టుకట్టడం ద్వారా మైక్రోసాఫ్ట్ అజూర్ శక్తిని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. -
ఘనంగా ఆవిర్భావ దినోత్సవం
గరిడేపల్లి : మండలంలోని గడ్డిపల్లిలో గురువారం గడ్డిపల్లి మిల్లు హమాలీ యూనియన్ ఐఎన్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం తమదేనన్నారు. కార్మికుల సంక్షేమమే సంఘం ధ్యేయమన్నారు. కార్యక్రమంలో మండల సంఘం అధ్యక్షుడు గుండు గుర్వయ్యగౌడ్, ఎంపీటీసీ సుందరి నాగేశ్వరరావు, బెల్లంకొండ గుర్వయ్యగౌడ్, సలిగంటి జానయ్య, ముక్కంటి వెంకన్న, సంపత్, తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా సభ్యత్వం గాల్లో పని చేస్తున్న కార్మికులు మూడు కోట్లకు పైబడి సభ్యత్వం కలిగి ఐఎన్టీయూసీ అతిపెద్ద యూనియన్‌గా కొనసాగుతుందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్నగౌడ్ అన్నారు. గురువారం మండలంలోని వేములూరు ప్రాజెక్ట్‌పై నిర్మించిన ఎన్‌ఏటీఎల్ పవర్‌ప్లాంట్ ఐఎన్టీయూసీ కార్మికులతో కలిసి 71వ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చ లిగంటి జానయ్య, నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు గురవ య్య, కరుణాకర్‌రెడ్డి, కోటేష్, ముక్కంటి, రామ్మూర్తి, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, సైదిరెడ్డి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రపంచంలో అతిపెద్ద పార్టీ...
భువనగిరిఅర్బన్ : భారతీయ జనతా పార్టీకి అత్యధిక సభత్వాలు కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన ఘనత ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథకంలో దూసుకెళ్తుందన్నారు. అవినీతిరహిత పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమ స్యలను గాలికొదిలిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమం త్రి కేసీఆర్ విఫలమయ్యారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావడం ఖాయమ న్నారు. భారతమాతను విశ్వగురువుగా నిలిపే యజ్ఞంలో భాగస్వా ములవుతున్నా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు చందా ఈశ్వర్‌గుప్తా, సాధు నారాయణ, నర్ల నర్సింగ్‌రావు, పోత్నక్ మురళీ, దొంత సుమిత్ర, బండారు బాలరాజు, ఊదరి లక్ష్మయ్య, కె.కృష్ణ, వీరేశం యాదవ్, చందా ఇందిరా, పోతంశెట్టి బాలయ్య, నక్కల స్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్, పట్టణ శాఖ అధ్యక్షుడు చందా మహేందర్‌గుప్తా, నాయకులు మాయ దశరథ, కృష్ణ, కోళ్ల భిక్షపతి, రావుల సత్తయ్య, నీలం రమేష్, ఎండీ మహమూద్, శ్రీశైలం, సంతోష్, చందుపట్ల నర్సింగ్‌రావు, జనగాం నర్సింహచారి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి సత్యదేవుని ఆవిర్భావ వేడుకలు
అన్నవరం (ప్రత్తిపాడు) : సత్యదేవుని 127వ ఆవిర్భావ దినోత్సవాలకు రత్నగిరి ముస్తాబైంది. సోమవారం నుంచి బుధవారం వరకూ మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించింది. ఉత్సవాలకు సోమవారం అంకురార్పణ చేస్తారు. ఈ సందర్భంగా రుత్విక్కులకు దీక్షావస్త్రాలు బహూకరిస్తారు. స్వామివారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి ఆయుష్య హోమానికి అంకురార్పణ చేస్తారు. ఈ ఏడాది కొత్తగా పవిత్రోత్సవాలను కూడా ప్రారంభించనున్నారు. స్వామివారికి వివిధ కూరగాయలు, సుగంధద్రవ్యాలతో వండిన పిండివంట ‘కాయం’ నివేదిస్తారు. స్వామివారి జన్మనక్షత్రం మఖ సందర్భంగా బుధవారం తెల్లవారుజామున కూడా స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహిస్తారు. రెండో రోజు కూడా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. అనంతరం చేతికి కట్టుకునే కంకణాలను భక్తులకు బహూకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవస్థానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీరామునికి ఘనంగా జన్మనక్షత్ర పూజలు రత్నగిరి క్షేత్రపాలకుడు శ్రీరామచంద్రమూర్తి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా రామాలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. కల్యాణ వేదికపై సూర్యనమస్కారాలు ప్రతి ఆదివారం రత్నగిరిపై సత్యదేవుని కల్యాణ వేదిక మీద నిర్వహిస్తున్న సూర్య నమస్కారాలు ఈ వారం కూడా కొనసాగాయి. ఆకొండి కృష్ణ, రేపాక రామదాసు, తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. -
టీఎస్ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఆవిర్భావం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర న్యాయవాద సంఘాల(బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్) సమాఖ్య ఆవిర్భవించింది. సమాఖ్య కన్వీనర్‌గా బి.కొండారెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి నేతృత్వంలో బార్ కౌన్సిల్ సభ్యులతోపాటు అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యనేతలు గురువారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ఈ సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. తెలంగాణ పది జిల్లాల బార్ అసోసియేషన్ల కార్యవర్గం ఈ సమాఖ్యలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. సమావేశంలో బార్‌కౌన్సిల్ సభ్యులు సహోదర్‌రెడ్డి, జావెద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు స్వరూపారాణి, శ్రీహరి ఆచారి, క్రాంతికుమార్, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, రవికుమార్ యాదవ్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.