హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర న్యాయవాద సంఘాల(బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్) సమాఖ్య ఆవిర్భవించింది. సమాఖ్య కన్వీనర్‌గా బి.కొండారెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి నేతృత్వంలో బార్ కౌన్సిల్ సభ్యులతోపాటు అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యనేతలు గురువారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ఈ సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నట్లు వారు ప్రకటించారు.
తెలంగాణ పది జిల్లాల బార్ అసోసియేషన్ల కార్యవర్గం ఈ సమాఖ్యలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. సమావేశంలో బార్‌కౌన్సిల్ సభ్యులు సహోదర్‌రెడ్డి, జావెద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు స్వరూపారాణి, శ్రీహరి ఆచారి, క్రాంతికుమార్, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, రవికుమార్ యాదవ్, వెంకటేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఆవిర్భావం
Published Fri, May 22 2015 5:59 AM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM
Advertisement
Advertisement