బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం వివాదాల సుడిలో చిక్కుకుంది. . తాజాగా ఆమెకు చండీగఢ్‌లోని జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. సినిమాలో సిక్కుల ప్రతిష్టను కించపరిచేలా నటించారని ఆరోపిస్తూ.. చండీగడ్ జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, అడ్వకేట్ రవీందర్ సింగ్ బస్సీ కంగనా రనౌత్ కు వ్యతిరేకంగా కోర్టులో పిటీషన్ వేశారు.
అయితే సినిమాలను సిక్కు ప్రజలను అభ్యంతరకంగా చూపించారని, అనేక తప్పుడు సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కంగనపై కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. కంగనకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్5కు వాయిదా వేసింది.
ఇక నటి, బీజేపీ ఎంపీ అయిన కంగనా నటించి, దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుంది. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉండగా.. నిషేధాన్ని ఎదుర్కొంటుంది. సినిమాలో సిక్కులను తప్పుగా చిత్రీకరిస్తున్నారని, చారిత్రక వాస్తవాలను వక్రీకరించిందని శిరోమణి అకాలీదళ్‌తో సహా పలు సిక్కు సంస్థలు ఆరోపించడంతో వివాదంలో చిక్కుకుంది.
సెన్సార్ సర్టిఫికేట్ పొందడంలో జాప్యం కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ కారణంగా ముంబైలోని తన ఆస్తిని బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని కంగనా ఇటీవల పేర్కొన్నారు. బాంద్రాలోని పాలి హిల్‌లో ఉన్న తన బంగ్లాను రూ. 32 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment