సాక్షి, బెంగళూరు: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు ఎదురు దెబ్బ తగిలింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై ఉగ్రవాదులంటూ నోరు పారేసుకున్న కంగనాకు కర్నాటక కోర్టు ఝలక్ ఇచ్చింది. ఆమెపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కర్నాటక లోని స్థానిక కోర్టు పోలీసులను ఆదేశించింది. ఫిర్యాదు కాపీని అందించాలని కూడా క్యతాసంద్ర పోలీస్ స్టేషన్ అధికారులకు ఆదేశాల్చింది. తుమకూరులోని ఎల్ రమేష్ నాయక్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఈ చర్య తీసుకుంది. (రోజూ వార్తల్లో ఉండకపోతే కంగనాకు భయం)
కాగా వ్యవసాయ బిల్లులకు (చట్ట రూపం దాల్చకముందు) నిరసన తెలుపుతున్న వారిని ఉగ్రవాదులుగా పోలుస్తూ కంగనా సెప్టెంబర్ 21న ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. వీటి గురించి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఇదే దేశంలో పలు ప్రాంతాల్లో నిరసనకు దారితీసిందని ఆరోపించింది. అంతేకాదు సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళన చేసినవారే ఈ ఉద్యమాన్ని కూడా చేపట్టారని, భీభత్సం సృష్టిస్తున్నారని కంగనా వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాది కోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment