Bar Associations
-
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్లకు పాలసీ
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజమైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సుప్రీం కోర్టు బార్ అసోసి యేషన్ (ఎస్సీబీఏ) సభ్యులకు గ్రూపు పాలసీని ప్రారంభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రా చేతుల మీదుగా ఈ పాలసీ విడు దలైంది. పాలసీలోని సభ్యులకు రూ.20 లక్షల కవరేజీ ఉంటుందని, 64 ఏళ్ల వయస్సులోపు ఎస్సీబీఏ మెంబర్లు పాలసీకి అర్హులని వెల్లడించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ.. ‘క్లైమ్ల పరిష్కారంలో ఎల్ఐసీ కచ్చితత్వం పాటిస్తుంది. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులకు గ్రూప్ పాలసీ ఏర్పాటుచేసిన విధంగా జిల్లాలు, ఇతర స్థాయిల్లోని బార్ అసోసియేషన్ సభ్యులకు కూడా ఎల్ఐసీ గ్రూప్ పాలసీలను అందించాల్సిన అవసరం ఉంది.’ అని వ్యాఖ్యానించారు. -
మానవ విలువలు మర్చిపోతున్నారు
- యాంత్రికంగా మారకుండా సమాజ సేవ చేయాలి - హైకోర్టు న్యాయవాద సంఘాల కార్యక్రమంలో బోధమయానంద సాక్షి, హైదరాబాద్: ఆయా రంగాల్లో ఉన్నత స్థారుుకి వెళ్లాలన్న ఆతృతలో ప్రజలు మానవీయ విలువలను మర్చిపోతున్నారని రామకృష్ణ మఠం, వివేకానంద హ్యూమ న్ ఎక్సలెన్సీ డెరైక్టర్ స్వామీ బోధమయానంద అన్నారు. తీరిక లేని ఈ జీవనంలో మనిషి యాంత్రికంగా మారకుండా, తనలోని దైవత్వాన్ని మేల్కొలిపి, సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం హైకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ సురేశ్ కెరుుత్, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసారుు, జస్టిస్ చల్లా కోదండరామ్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మనిషి తాను చేసే ప్రతీ పనిని నిజారుుతీ, నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉందని బోధమయానంద అన్నారు. జీవితంలో శ్రేష్టమైన వ్యక్తులుగా ఎదిగేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. సమస్యల పట్ల స్పందించే గుణం, పరి పక్వ ఆలోచన, కష్టించి పనిచేయాలన్న తపన మనుషులను విశిష్ట వ్యక్తులుగా మలు స్తాయన్నారు. తర్వాత జస్టిస్ రామసుబ్రమణియన్.. రామకృష్టమఠంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వివేకానంద కళాశాలలో సాగిన విద్యాభ్యాస కాలం తన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. రామకృష్ణ మఠం నిస్వా ర్థంగా ఎన్నో ఏళ్ల తరబడి సమాజ సేవ చేస్తోందని కొనియాడారు. అనంతరం ఉభయ సంఘాల ప్రతినిధుల ఆధ్వరంలో బోధమయానందను శాలువాతో సత్కరించారు. -
టీఎస్ బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఆవిర్భావం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర న్యాయవాద సంఘాల(బార్ అసోసియేషన్స్ ఫెడరేషన్) సమాఖ్య ఆవిర్భవించింది. సమాఖ్య కన్వీనర్‌గా బి.కొండారెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్ నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండారెడ్డి నేతృత్వంలో బార్ కౌన్సిల్ సభ్యులతోపాటు అన్ని జిల్లాల బార్ అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్యనేతలు గురువారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ఈ సమాఖ్యను ఏర్పాటు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. తెలంగాణ పది జిల్లాల బార్ అసోసియేషన్ల కార్యవర్గం ఈ సమాఖ్యలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. సమావేశంలో బార్‌కౌన్సిల్ సభ్యులు సహోదర్‌రెడ్డి, జావెద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు స్వరూపారాణి, శ్రీహరి ఆచారి, క్రాంతికుమార్, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, రవికుమార్ యాదవ్, వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.