ప్రపంచంలో అతిపెద్ద పార్టీ... | World's Largest Democratic Political Party | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అతిపెద్ద పార్టీ బీజేపీ

Published Sat, Apr 7 2018 10:18 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

World's Largest Democratic Political Party - Sakshi

జెండాను ఆవిష్కరిస్తున్న పీవీ శ్యాంసుందర్‌రావు

భువనగిరిఅర్బన్‌ : భారతీయ జనతా పార్టీకి అత్యధిక సభత్వాలు కలిగి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన ఘనత ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు పేర్కొన్నారు.  బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి పథకంలో దూసుకెళ్తుందన్నారు. అవినీతిరహిత పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమ స్యలను గాలికొదిలిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమం త్రి కేసీఆర్‌ విఫలమయ్యారని పేర్కొన్నారు.

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి రావడం ఖాయమ న్నారు. భారతమాతను విశ్వగురువుగా నిలిపే యజ్ఞంలో భాగస్వా ములవుతున్నా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ  శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ సీనియర్‌ నాయకులు చందా ఈశ్వర్‌గుప్తా, సాధు నారాయణ, నర్ల నర్సింగ్‌రావు, పోత్నక్‌ మురళీ, దొంత సుమిత్ర, బండారు బాలరాజు, ఊదరి లక్ష్మయ్య, కె.కృష్ణ, వీరేశం యాదవ్, చందా ఇందిరా, పోతంశెట్టి బాలయ్య, నక్కల స్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్, పట్టణ శాఖ అధ్యక్షుడు చందా మహేందర్‌గుప్తా, నాయకులు మాయ దశరథ, కృష్ణ, కోళ్ల భిక్షపతి, రావుల సత్తయ్య, నీలం రమేష్, ఎండీ మహమూద్, శ్రీశైలం, సంతోష్, చందుపట్ల నర్సింగ్‌రావు, జనగాం నర్సింహచారి, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement