టెక్నాలజీ పెరిగిన తర్వాత తెర వెనక జరుగుతోన్న అతి పెద్ద వ్యాపారాల్లో క్లౌడ్ సర్వీస్ ఒకటి. ఇల్లు పెద్దదయితే ఒకటో, రెండో పోర్షన్లను అద్దెకు ఇచ్చినట్టు.. మనకు కావాల్సిన డాటా స్టోరేజీని అద్దెకివ్వడమే క్లౌడ్ సర్వీస్. మనం ఇంటర్నెట్‌లో చేస్తున్న పనుల్లో మెజార్టీ భాగం క్లౌడ్ సేవల నుంచే అందుతున్నాయి. క్లౌడ్ సేవలను పూర్తిగా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహిస్తారు. అవి ప్రొవైడర్ల సర్వర్‌ల నుండి కస్టమర్‌లకు అందుబాటులోకి వస్తాయి, కాబట్టి కంపెనీకి దాని సొంత సర్వర్‌లను వాడాల్సిన అవసరం రాదు. ఇప్పుడు తాజాగా హైదరాబాద్‌ను అమెజాన్ సెకండ్ రీజయిన్ సెంటర్‌గా ప్రకటించింది.
♦ ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద క్లౌడ్ సర్వీస్ అమెజాన్‌దే.
♦ వేర్వేరు దేశాల్లో 84 జోన్లలో వీటికి స్టోరేజీ ఉంది. ఏడాదికి 75 బిలియన్ డాలర్ల వ్యాపారం
♦ రెండో స్థానం మైక్రోసాఫ్ట్ అజ్యూర్, అయితే ఆదాయంలో అమెజాన్‌ను దాటి పోయింది. ఏడాదికి 95 బిలియన్ డాలర్ల వ్యాపారం
♦ మూడో స్థానం గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫాం, ముఖ్యమైన దేశాల్లో సర్వర్లున్నాయి. ఏడాదికి 25 బిలియన్ డాలర్ల వ్యాపారం
♦ నాలుగో స్థానం అలీబాబా క్లౌడ్. చైనా మార్కెట్ దీని సొంతం. దాదాపు 15 బిలియన్ డాలర్ల వ్యాపారం
♦ డాటాబేస్ మేనేజ్‌మెంట్‌లో విస్తృత అనుభవం ఉన్న ఒరాకిల్ కంపెనీ.. క్లౌడ్ వ్యాపారంలో ఏడాదికి 12 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది
♦ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఐబీఎం కూడా క్లౌడ్ వ్యాపారం చేస్తోంది. ఏడాదికి 10 బిలియన్ డాలర్ల వ్యాపారం.
♦ టెన్సెంట్ క్లౌడ్ ప్రధానంగా తూర్పు ఆసియా కేంద్రంగా నడుస్తోంది. చైనాలోనూ దీని సేవలు విస్తృతంగా ఉన్నాయి.
♦ OVH క్లౌడ్ సేవలు ప్రధానంగా యూరప్‌లో ఉన్నాయి. ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, యూకే దేశాల్లో దీనికి పేరుంది.
♦ డిజిటల్ ఓషియన్, లినోడ్ ఎంపిక చేసుకున్న పెద్ద నగరాల్లో క్లౌడ్ సర్వీసులు అందిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment