Nokia Plans To Launch Cloud Based Software Subscription Service For Telecom Companies: టెలికాం కంపెనీలను లక్ష్యంగా చేసుకొని నోకియా భారీ ఆలోచనతో ముందుకురానుంది. అనలిటిక్స్, సెక్యూరిటీ , డేటా మేనేజ్‌మెంట్ సర్వీస్ సాఫ్ట్‌వేర్‌ను అందించడం కోసం క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు నోకియా బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అనేక సాంకేతిక సంస్థలు ఊహాజనిత, పునరావృత వ్యాపారాన్ని నిర్మించడానికి ముందస్తు లైసెన్సింగ్ నుంచి సబ్‌స్క్రిప్షన్ మోడల్ వైపుగా కదులుతున్నాయి. దీంతో నోకియా సబ్‌స్క్రిప్షన్ మోడల్ వైపుగా చూస్తున్నట్లు తెలుస్తోంది.
చదవండి: తగ్గేదె లే అంటున్న జియో!
నోకియా రూపొందించిన పలు సాఫ్ట్‌వేర్ పోర్ట్‌ఫోలియోలను ఈ ఏడాది నుంచి సబ్‌స్క్రిప్షన్ బేస్‌లో అందిస్తుండగా...వచ్చే ఏడాది ప్రారంభంలో పూర్తిగా ఆయా సాఫ్ట్‌వేర్ పోర్ట్‌ఫోలియోలను వాణిజ్యపరంగా అందుబాటులో ఉంచాలని నోకియా భావిస్తోంది. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సర్వీసులను నోకియా 2016లోనే సృష్టించినప్పటికీ...సబ్‌స్క్రిప్షన్ మోడల్‌పై కంపెనీ అంతగా మొగ్గుచూపలేదని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మార్క్ బన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తోందని మార్క్ వెల్లడించారు. దీంతో పలు టెలికాం కంపెనీల వ్యయాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్లౌడ్-ఆధారిత సాఫ్ట్‌వేర్ టెలికాం కంపెనీల డేటా, అనలిటిక్స్, సెక్యూరిటీ పరంగా నిర్వహణ మరింత సులభతం కానుంది. ఇప్పటికే పలు టెలికాం కంపెనీలతో క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ వినియోగంపై నోకియా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 2021-2025 కాలానికి 3.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 23,060 కోట్లు) ను నోకియా లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment