మైక్రోసాఫ్ట్ సంస్థ గూగుల్, ఓపెన్ ఏఐతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. అందుకు తగ్గట్టు ఇంటర్నల్ ఏఐ లాంగ్వేజ్ మోడల్‌కు శిక్షణ ఇస్తోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎంఏఐ-1 అనే కొత్త ఏఐ మోడల్‌ను తర్వలో వినియోగాదారులకు పరిచయం చేయనున్నట్లు తెలిసింది.
ఈమేరకు గూగుల్ డీప్‌మైండ్ సహ వ్యవస్థాపకుడు, ఐఏ స్టార్టప్ ఇన్‌ఫ్లెక్షన్ మాజీ సీఈఓ ముస్తఫా సులేమాన్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మోడల్ వినియోగంలోకి వస్తే దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్ డెవలపర్ కాన్ఫరెన్స్ జరిగిన వెంటనే కొత్త మోడల్‌ను ప్రివ్యూ చేసే అవకాశం ఉందని తెలిసింది.
ఇదీ చదవండి: ప్రముఖ కంపెనీలకు ఇకపై బాస్‌లు వీరే..
ఎంఏఐ-1 గతంలో మైక్రోసాఫ్ట్ రూపొందించిన ఓపెన్ సోర్స్ మోడల్‌ల కంటే అధిక సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇది దాదాపు 500 బిలియన్ పారామీటర్‌లను కలిగి ఉంటుందని నివేదిక ద్వారా తెలిసింది. మైక్రోసాఫ్ట్ గత నెలలో ఫై-3-మినీ అనే మినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్‌ను ప్రారంభించింది. తక్కువ ఖర్చుతో యూజర్లకు సేవలందించేలా దీన్ని రూపొందించారు. ఫై-3 మినీ 3.8 బిలియన్ పారామితులను కలిగి ఉంది. మైక్రోసాఫ్ట్ మార్చిలో సులేమాన్‌ను కొత్తగా తయారుచేసిన యూజర్ ఏఐ యూనిట్‌కు అధిపతిగా నియమించింది. ఇన్‌ఫ్లెక్షన్ స్టార్టప్‌లోని అనేక మంది నిపుణులను కంపెనీలో చేర్చుకుంది. ఓపెన్‌ఏఐలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు అధికంగా ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment