Cloud company
-
విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..!
Wipro Acquires US-Based Leanswift To Expand Its Cloud Transformation Biz: భారత టెక్ దిగ్గజం విప్రో అమెరికాకు చెందిన లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్‌ను సొంతం చేసుకుంది. లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్లు గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్సల్టింగ్ కంపెనీ విప్రో బుధవారం రోజున ప్రకటించింది. ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ సర్వీసెస్ ద్వారా క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ బిజినెస్‌ను విస్తరించడానికి కంపెనీ వ్యూహానికి అనుగుణంగా విప్రో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సముపార్జన 2022 మార్చి 31తో పూర్తవుతోందని విప్రో బీఎస్ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది. కన్సల్టింగ్, ఇంప్లిమెంటేషన్ స్పేస్ రెండింటిలో లీన్‌స్విఫ్ట్ ఇన్ఫోర్ ఇండస్ట్రీ క్లౌడ్ సర్వీసెస్‌లో విప్రో స్థానాన్ని నెలకొల్పుతుందని కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. యూఎస్, స్వీడన్ , భారత్ అంతటా డెవలప్మెంట్ కార్యాలయాలను లీన్‌స్విఫ్ట్ కలిగి ఉంది. లీన్‌స్విఫ్ట్ , పంపిణీ, రసాయనాలు, ఫ్యాషన్, ఆహారం & పానీయాల పరిధిలో విస్తరించి ఉంది. ఇ-కామర్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సప్లై చైన్, వేర్‌హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ , ఇంటిగ్రేషన్లలో లీన్‌స్విఫ్ట్ సేవలను అందిస్తుంది. ఈ సముపార్జనతో క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యాపారంలో ఆయా క్లైయిట్లకు మెరుగైన క్లౌడ్ ఆధారిత సేవలను అందిస్తామని విప్రో లిమిటెడ్ అప్లికేషన్స్ & డేటా, iDEAS, ప్రెసిడెంట్ హరీష్ ద్వారకన్హల్లి అభిప్రాయపడ్డారు. చదవండి: ఎలన్ మస్క్ తర్వాత సింగ్ ఈజ్ ‘కింగ్’ అవుతాడా? -
మైక్రోసాఫ్ట్ యూజర్లకు అలర్ట్!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలతో సహా వేలాది మంది క్లౌడ్ కంప్యూటింగ్ యూజర్లను హెచ్చరించింది. హ్యాకర్లు మీ డేటాబేస్ వివరాలు చదవడం, మార్చడం లేదా తొలగించవచ్చు అని ఒక సైబర్ సెక్యూరిటీ పరీశోధకుల బృందం పేర్కొంది. మైక్రోసాఫ్ట్ అజ్యూరే కాస్మోస్ డీబీ డేటాబేస్ లో ఈ లోపం ఉంది. వేలాది కంపెనీలు కలిగి ఉన్న ఈ డేటాబేస్ లను యాక్సిస్ చేసే కీలను హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశం ఉంది అని భద్రతా సంస్థ విజ్ పరిశోధన బృందం కనుగొంది. విజ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అమీ లుట్వాక్ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సెక్యూరిటీలో మాజీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ ఆ కీలను మార్చలేదు కాబట్టి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలని వినియోగదారులకు గురువారం ఈ-మెయిల్ చేసింది. మైక్రోసాఫ్ట్ విజ్ కు పంపిన ఈమెయిల్ ప్రకారం.. లోపాన్ని కనుగొన్నందుకు విజ్ కు $40,000 (సుమారు రూ.30 లక్షలు) చెల్లించడానికి అంగీకరించింది. "మా కస్టమర్లను సురక్షితంగా సంరక్షించడం కొరకు మేం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాం. ఈ విషయంలో మాకు సహాయం చేసినందుకు భద్రతా పరిశోధకులకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం" అని మైక్రోసాఫ్ట్ రాయిటర్స్ కు తెలిపింది.(చదవండి: వన్‌ప్లస్ యూజర్లకు బంపర్ ఆఫర్!) ఈ లోపం దోపిడీకి గురైనట్లు ఎలాంటి ఆధారాలు లేవని వినియోగదారులకు మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ లో తెలిపింది. "ఇది మీరు ఊహించలేని అతి పెద్ద లోపం. ఇది దీర్ఘకాలిక రహస్యం" అని లుట్వాక్ రాయిటర్స్ కు చెప్పారు. "అజ్యూరే సెంట్రల్ డేటాబేస్, మేము కోరుకున్న కస్టమర్ డేటాబేస్ ను మేము యాక్సెస్ చేసుకోగలిగాము" అని లుట్వాక్ బృందం ఆగస్టు9న కాస్మోస్ డీబీ అని పిలువబడే సమస్యను కనుగొంది. అయితే మైక్రోసాఫ్ట్ ఆగస్టు 12న నోటిఫై చేసినట్లు లుట్వాక్ చెప్పారు. -
ఇజ్రాయెల్ క్లౌడిన్ లో ఇన్ఫోసిస్ పెట్టుబడులుq
బెంగళూరు: ఇజ్రాయెల్‌కు చెందిన క్లౌడ్ కంపెనీ క్లౌడిన్లో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ రూ.27 కోట్లు పెట్టుబడులు పెట్టింది. అయితే ఐదేళ్ల నుంచి అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ఇజ్రాయెల్ కంపెనీలో ఎంత వాటా కొనుగోలు చేసింది ఇన్ఫోసిస్ వెల్లడించలేదు. ఈ నెల 15 కల్లా ఈ ఇన్వెస్ట్మెంట్ పూర్తవుతుందని పేర్కొంది. కాగా విప్రో ఎంటర్‌ప్రెజైస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఇటీవలనే ఇజ్రాయెల్‌కే చెందిన హెచ్. ఆర్. గివోన్ను కొనుగోలు చేసింది.