Wipro Acquires US-Based Leanswift To Expand Its Cloud Transformation Biz: భారత టెక్ దిగ్గజం విప్రో అమెరికాకు చెందిన లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్‌ను సొంతం చేసుకుంది. లీన్‌స్విఫ్ట్ సొల్యూషన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై సంతకం చేసినట్లు గ్లోబల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కన్సల్టింగ్ కంపెనీ విప్రో బుధవారం రోజున ప్రకటించింది. ఫుల్‌స్ట్రైడ్ క్లౌడ్ సర్వీసెస్ ద్వారా క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ బిజినెస్‌ను విస్తరించడానికి కంపెనీ వ్యూహానికి అనుగుణంగా విప్రో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సముపార్జన 2022 మార్చి 31తో పూర్తవుతోందని విప్రో బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది.
కన్సల్టింగ్, ఇంప్లిమెంటేషన్ స్పేస్ రెండింటిలో లీన్‌స్విఫ్ట్ ఇన్‌ఫోర్ ఇండస్ట్రీ క్లౌడ్ సర్వీసెస్‌లో విప్రో స్థానాన్ని నెలకొల్పుతుందని కంపెనీలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. యూఎస్, స్వీడన్ , భారత్ అంతటా డెవలప్‌మెంట్ కార్యాలయాలను లీన్‌స్విఫ్ట్ కలిగి ఉంది. లీన్‌స్విఫ్ట్ , పంపిణీ, రసాయనాలు, ఫ్యాషన్, ఆహారం & పానీయాల పరిధిలో విస్తరించి ఉంది. ఇ-కామర్స్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సప్లై చైన్, వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, బిజినెస్ ఇంటెలిజెన్స్ , ఇంటిగ్రేషన్‌లలో లీన్‌స్విఫ్ట్ సేవలను అందిస్తుంది. ఈ సముపార్జనతో క్లౌడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ వ్యాపారంలో ఆయా క్లైయిట్లకు మెరుగైన క్లౌడ్ ఆధారిత సేవలను అందిస్తామని విప్రో లిమిటెడ్ అప్లికేషన్స్ & డేటా, iDEAS, ప్రెసిడెంట్ హరీష్ ద్వారకన్‌హల్లి అభిప్రాయపడ్డారు.
చదవండి: ఎలన్ మస్క్ తర్వాత సింగ్ ఈజ్ ‘కింగ్’ అవుతాడా?
Comments
Please login to add a commentAdd a comment