TRS Corporator Vijayareddy Likely To Join In Congress, Met TPCC Chief Revanth Reddy - Sakshi
Sakshi News home page

TRS Corporator Vijayareddy: పీజేఆర్‌ కూతురిగా టీఆర్‌ఎస్‌లో ఉండలేకపోతున్నా

Published Sat, Jun 18 2022 10:35 AM | Last Updated on Sat, Jun 18 2022 1:26 PM

TRS Corporator Vijayareddy meets TPCC Chief Revanth Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి శనివారం ఉదయం​ భేటీ అయ్యారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గాఉన్న విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఆమె రేవంత్‌ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. 

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం విజయారెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. 'కాంగ్రెస్‌ కోసం పీజేఆర్‌ ఎంతో పనిచేశారు. కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్‌ ఉంటుందని నమ్ముతున్నా. చాలా రోజుల నుంచి రేవంత్‌రెడ్డితో చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్‌. టీఆర్‌ఎస్‌లో పరిస్థితులు బాగాలేవు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్‌ పార్టీయే. పీజేఆర్‌ కూతురిగా టీఆర్‌ఎస్‌లో ఉండలేకపోతున్నానని' విజయారెడ్డి అన్నారు.

చదవండి: (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనక సంచలన విషయాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement