
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన యత్నంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. తమతో పలు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘు నందన్‌రావు మీడియాతో మాట్లాడిన వీడి యోను బుధవారం ఆయన ట్యాగ్ చేశారు. ఆ పార్టీ కొనుగోళ్లపై తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అంటూ రేవంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
చదవండి: హైడ్రామా: నేరుగా ప్రగతిభవన్‌కే.. కేసీఆర్‌తో ఆ నలుగురు భేటీ