హైదరాబాద్, సాక్షి: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నటుడు అల్లు అర్జున్(Allu Arjun) విచారణ వేళ.. మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్‌ను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారాయన. సాక్షితో ఆయన మాట్లాడుతూ..
‘‘రేవతి కుటుంబం పట్ల అందరికీ సానుభూతి ఉంది. పేదలైనా.. పెద్దలైనా వారికి మేం అండగా ఉంటాం. అల్లు అర్జున్ విషయంలో కాంగ్రెస్ చేసేది ముమ్మాటికీ రాజకీయమే. అసెంబ్లీలో తన దోస్తుతో(ఎంఐఎం అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి..) ప్రశ్న అడిగించుకోని కాంగ్రెస్ రాజకీయం చేసింది. అలాంటప్పుడు.. మొదటి రోజే ఎందుకు కాంగ్రెస్ (Congress party) నేతలు రేవతి కుటుంబాన్ని పరామర్శించలేదు?..
ముమ్మాటికీ పోలీసుల వైఫల్యం కారణంగానే ఘటన జరిగింది. అసలు అనుమతి లేదన్నప్పుడు అల్లు అర్జున్ ను ఇంటి నుంచి ఎందుకు బయటకు రానిచ్చారు. ఇంటి వద్దే ఆయన్ని బారికేడ్లు వేసి ఎందుకు అడ్డుకోలేదు?. థియేటర్ వద్ద యూనిఫాం లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా!. సంధ్య థియేటర్ గేట్లు మూసివేసి హీరో వెహికిల్ ను టోయింగ్ ఎందుకు చేయలేదు?. కేవలం అల్లు అర్జున్ అరెస్ట్‌తో వచ్చిన బద్నాంను తప్పించుకునేందుకే ఇంతా చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ కక్ష గట్టి సాధిస్తోంది ’’ అని అన్నారాయన. ఇదిలా ఉంటే బీజేపీ అల్లు అర్జున్‌కు అండగా ఉంటుందని ఆ పార్టీ కీలక నేత బండి సంజయ్ (Bandi Sanjay) ఇంతకు ముందే ప్రకటించారు.
అంబేద్కర్ ఇష్యూపై..
కాంగ్రెస్ కు అంబేద్కర్ పేరును తీసే అర్హత లేదని రఘునందన్ చెబుతున్నారు. ‘‘తెలంగాణలో 125 అడుగుల విగ్రహానికి కనీసం దండ వేయలేదు రేవంత్ ప్రభుత్వం. అంతపెద్ద విగ్రహానికి గేటుకు తాళం వేసిన రోజే కాంగ్రెస్ చెంపలు వేసుకొని క్షమాపణలు చెప్పాలి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కు కనీసం భారతరత్న ఇవ్వలేదు కాంగ్రెస్. అంబేద్కర్ ను అన్ని రకాలుగా కాంగ్రెస్సే అవమానించింది. హాస్టళ్లలో ఫుడ్ తిని విద్యార్థులు చనిపోతున్నారు. దాన్ని డైవర్ట్ చేసేందుకు సీఎం సైతం ఆందోళనల్లో పాల్గొంటున్నారు అని రఘునందన్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment