ప్రజావాణిలో అల్లు అర్జున్‌ మామ ఫిర్యాదు.. విషమేమిటంటే? | Allu Arjun Father In Law Kancharla Chandrasekhar Reddy Complaint In Prajavani | Sakshi
Sakshi News home page

ప్రజావాణిలో అల్లు అర్జున్‌ మామ ఫిర్యాదు.. విషమేమిటంటే?

Published Mon, Feb 10 2025 12:53 PM | Last Updated on Mon, Feb 10 2025 1:19 PM

Allu Arun Uncle Chandrashekar Participated In Prajavani

సాక్షి, హైదరాబాద్‌: సినీ నటుడు అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌ రెడ్డి ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలో తన ఇంటి స్థలం గురించి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-92లో తమ ప్రాపర్టీస్ విషయంపై పునరాలోచించాలని ప్రజావాణిలో ఫిర్యాదులో పేర్కొన్నారు.

అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదు అందించారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు వద్ద రోడ్డు విస్తరణలో తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. రోడ్డు విస్తరణలో తన ప్లాటు ఒకవైపు 20 అడుగులు మరోవైపు 36 అడుగుల భూమి సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలంటూ అధికారులను కోరారు. కాగా, కొన్ని నెలల క్రితం కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రూ.1100 కోట్లు ఖర్చు చేయాలని అధికారులు ప్లాన్‌ చేశారు. ఇందులో భాగంగానే రోడ్డు విస్తరణతో పాటుగా పలు కార్యక్రమాలను చేపట్టారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి(Kancherla Chandrasekhar Reddy) మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరి భేటీ సందర్భంగా వారిద్ధరూ ఏ అంశాలపై చర్చించారన్న దానిపై వివరాలు వెల్లడి కాలేదు. అల్లు అర్జున్ అరెస్టు ఎపిసోడ్ తర్వాతా చంద్రశేఖర్ రెడ్డి గాంధీభవన్‌కు రెండోసారి వెళ్లడం చర్చనీయాంశమైంది.
 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement