Kancharla Chandrasekhar Reddy
-
Malkajgiri Lok Sabha: అందరి దృష్టి ఆ సీటుపైనే
సాక్షి, హైదరాబాద్: మల్కాజిగిరి. ఇప్పుడు దానిపైనే అందరి గురి. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని రాజకీయ పక్షాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. కేంద్రంలో మళ్లీ తమదే అధికారమని చెబుతున్న బీజేపీ నేతలు దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తుండగా, రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఇక్కడ సత్తా చాటాలని భావిస్తోంది. ఇక కాంగ్రెస్.. రాష్ట్రంలో గెలుపుతోనే తమ లక్ష్యం పూర్తి కాలేదని లోక్‌సభలోనూ బలం చాటేందుకు వ్యూహరచన చేస్తోంది. అన్ని పారీ్టలకూ హాట్ సీట్ అన్ని పారీ్టలూ వేటికవి మల్కాజిగిరిలో గెలుపుతో బలం చాటుకోవాలని ఆరాటపడుతున్నాయి. టికెట్ కోసం మాత్రం కాంగ్రెస్‌లో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న వారితో పాటు కొత్తగా చేరుతున్న వారు సైతం దానిపైనే ఆశలు పెట్టుకున్నారు. అధిష్టానం హామీలిస్తుందో లేదో కానీ ఎవరికి వారుగా ఈ సీటును దక్కించుకోవాలనే తలంపుతోనే ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలుస్తోంది. మల్కాజిగిరి ఎంపీగా ఉంటూనే రేవంత్‌రెడ్డి అటు పీసీసీ అధ్యక్షుడిగా విజయం సాధించడంతో పాటు ఇటు ముఖ్యమంత్రి కావడంతో సెంటిమెంట్ పరంగానూ భారీ డిమాండ్ ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో మల్కాజిగిరికి ప్రాతినిధ్యం వహించే రేవంత్ వారసుడెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందరెందరో.. మల్కాజిగిరి లోక్‌సభ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో కంచర్ల చంద్రశేఖరరెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, సర్వే సత్యనారాయణ, బొంతు రామ్మోహన్, సింగిరెడ్డి హరివర్ధ¯న్రెడ్డిలతో పాటు ఇంకా కాంగ్రెస్‌లో చేరనివారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో కంచర్ల చంద్రశేఖరరెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పట్లో ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. సినీనటుడు అల్లు అర్జున్‌కు మామ కావడంతో పాటు ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడంతో చంద్రశేఖరరెడ్డి పేరు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చింది. నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన భువనగిరి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను కోరుకున్న చోట కాకుండా మహేశ్వరం టికెట్ ఇవ్వడంతో ఓటమిపాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఈసారి ఎంపీ సీటు కోసం ప్రయతి్నస్తున్నట్లు వినికిడి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి ఎంటీ టికెట్ కోసం ప్రయతి్నస్తున్నట్లు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం దక్కని సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత భర్త, బీఆర్ఎస్ నేత మోతె శోభన్‌రెడ్డి, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణలు సైతం మల్కాజిగిరి టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అటు నుంచి ఇటు.. ప్రముఖ వ్యాపారి, మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎమ్మెల్యేకు కూడా కాంగ్రెసే ఆఫర్ ఇచి్చనట్లు ఓ వైపు ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు బీఆర్ఎస్ను వీడి వస్తే ఆయనకు మల్కాజిగిరి టికెట్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సైతం పార్టీ మారి తిరిగి ఎంపీగా పోటీకి సిద్ధమైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకా ఎవరెవరు ఏయే పారీ్టల నుంచి కాంగ్రెస్‌లోకి వస్తారో.. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నియోజకవర్గ ఎంపీ టిక్కెట్ ఎవరిని వరిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే! -
సీఎం రేవంత్‌ని కలిసిన అల్లు అర్జున్ మామ.. కారణం అదేనా?
పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇతడి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గురించి కొందరికి తెలుసు. పలు విద్యాసంస్థలు, వ్యాపారాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈయన బీఆర్ఎస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. అలాంటిది తాజాగా ఈయన.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఆ ఫొటో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: హీరో కార్తీకి రూ. కోటి చెక్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్) అదే కారణమా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలు.. సీఎం రేవంత్ రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. వీళ్లలో కొందరు కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భేటీ కూడా అలాంటిదేనని మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్లో టికెట్ అశించి భంగపడ్డ ఈయన.. కాంగ్రెస్ లో చేరారని, అలానే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్‌సభ స్థానం నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి పోటీలో నిలబడాలని అనుకుంటున్నారు. గతంలో ఆ స్థానానికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దృష్ట్యా.. ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే తన అల్లుడు అల్లు అర్జున్ క్రేజ్ కూడా కలిసివచ్చే అవకాశముంది. (ఇదీ చదవండి: రామ్‌చరణ్‌ను కలిశా.. ఏం మాట్లాడానో అడగొద్దు: విశ్వక్ సేన్) -
అల్లు అర్జున్ అత్తకు ఓటు లేక నిరాశతో..
బంజారాహిల్స్: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ మామ, టీఆర్ఎస్ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు ఓటు వేసేందుకు ఫిలింనగర్‌లోని ఎఫ్ఎన్సీసీకి వచ్చారు. అయితే చంద్రశేఖర్‌రెడ్డి ఓటు ఉండగా ఆయన భార్య అరుణ ఓటు గల్లంతయింది. దీంతో ఆమె నిరాశగా వెళ్లిపోయారు. ఎఫ్‌ఎన్‌సీసీలోనే ఎప్పటిలాగే ఓటు వేయడానికి వచ్చిన స్థానికురాలు డాక్టర్ వై.సుశీలారెడ్డి ఎప్పటిలాగే ఓటు వేయడానికి వచ్చారు. అయితే జాబితాలో ఓటు లేదని చెప్పడంతో నిరాశతో ఇంటి ముఖం పట్టారు. బంజారాహిల్స్ రోడ్‌నెం. 12లోని ఎన్బీటీ నగర్లో పోచమ్మగుడి వెనుకాల ఓటర్లు ఎన్బీటీ నగర్ స్కూల్లో ఓటు వేయడానిక వెళ్ళారు. అయితే వందలాది మంది ఓట్లు జూబ్లీహిల్స్ నియోజక వర్గం పరిధిలోని బోరబండ పోలింగ్ బూత్‌లో నమోదు కావడంతో షాక్ తిన్నారు. ఇందులో కొంత మంది ఓపికగా అక్కడిదాకా వెళ్ళి ఓటువేశారు. ఇలా దాదాపు అన్ని పోలింగ్ బూత్‌లలో ఓట్లు గల్లంతు ఓటర్లను కంగుతినేలా చేసింది. తాము ఎప్పుడూ ఓటు వేస్తుంటామని ఈ సారి ఓటు ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. -
మంచిరెడ్డికి ఓటెయ్యవద్దు: కంచర్ల
సాక్షి, ఇబ్రహీంపట్నం(రంగారెడ్డి జిల్లా): టీఆర్ఎస్ అభ్యర్థులకు ఇప్పుడు రెబెల్ నాయకులతో తలనొప్పి వస్తోంది. ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరిన అభ్యర్థులకు ప్రస్తుతం పెద్ద సమస్య ఏర్పడింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు వారికి సహకరించే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి గెలిచి, టీఆర్ఎస్లో చేరిన వారందరికీ సీఎం కేసీఆర్ టిక్కెట్లు ఇచ్చారు. గతంలో ఆ స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన వారికి ఎలాంటి హామీలు ఇవ్వకపోవడంతో వారు టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేక ప్రచారం ప్రారంభించారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అభ్యర్థిగా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్రకటించారు. 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి గెలిచారు. అనంతరం పార్టీ మారి టీఆర్ఎస్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిలబడి సుమారు 22 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఈసారి పార్టీ టిక్కెట్ తనకు ఇవ్వకుండా పార్టీ మారి వచ్చిన మంచిరెడ్డికి ఇవ్వడంతో ఆయన తిరుగుబావుటా వేశారు. మంచిరెడ్డి ఓడించాలని ఊరూరా తిరిగి ప్రచారం చేస్తున్నారు. బండరావిరాలలో శుక్రవారం ఆయన స్థానికులతో మాట్లాడుతూ.. మంచిరెడ్డికి ఓటు వేయొద్దని కోరారు. పార్టీ మారి వచ్చిన అభ్యర్థులందరికీ ఇదే పెద్ద సమస్యగా మారింది. -
అడకత్తెరలో అల్లు అర్జున్!
'డబుల్ ధమాకా'తో యమ హుషారుగా ఉన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎన్నికల సమరం సంకట స్థితిలోకి నెట్టింది. కొడుకు పుట్టిన ఆనందం, రేసు గుర్రం సినిమా విజయంతో జోరుమీదున్న బన్నీకి ఎన్నికలు సందిగావస్థ కలిగించాయి. ముగ్గురు మామల్లో ఎవరికి మద్దతు తెలపాలో తెలియక బన్నీ సతమవుతున్నాడు(ట). ఒకవైపు పిల్లనిచ్చిన మామ, మరోవైపు రక్తం పంచిన మేనమామలు ఉండడంతో ఎవరి పక్కనే నిలబడాలో తేల్చుకోలేకపోతున్నాడట అల్లువారి వారసుడు. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ శేఖర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సీటు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అటు పెద్ద మేనమామ చిరంజీవి సీమాంధ్రలో కాంగ్రెస్ తరపున ప్రచార బాధ్యతలు తలకెత్తుకున్నారు. ఇక చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టి నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించారు. ముగ్గురిలో ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియక బన్నీ సతమవుతున్నాడట. పిల్లనిచ్చిన మామకు ప్రచారం చేయాలా, మేనమామల పక్షానా నిలబడాలా అనేది తేల్చుకోలేకపోతున్నాడు. దీంతో అల్లు అర్జున్ పరిస్థితి అడకత్తెర పోక చెక్కలా తయారయింది. మామకు ప్రచారం చేసే విషయంపై బన్నీ ఇప్పటివరకు నోరు విప్పలేదు. మేనమామలకు మద్దతు ఇచ్చే విషయంపై కూడా బన్నీ సూటిగా స్పందించలేదు. పవన్ అంటే ఇష్టం, చిరంజీవి అంటే ప్రాణమని మాత్రమే చెప్పాడు కానీ మద్దతుపై మాట్లాడలేదు. చిన్న మేనమామ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై ఇప్పటివరకు స్పందించలేదు. రేసుగుర్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంగీకరించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ మే నెలలో ప్రారంభమవుతుంది. ఈలోపు జరగనున్న ఎన్నికల్లో బన్నీ ఏవిధంగా ముందుకు వెళతాడనే దాని గురించి అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.