పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇతడి మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గురించి కొందరికి తెలుసు. పలు విద్యాసంస్థలు, వ్యాపారాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఈయన బీఆర్ఎస్ నాయకుడిగా కొనసాగుతున్నారు. అలాంటిది తాజాగా ఈయన.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, ఆ ఫొటో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
(ఇదీ చదవండి: హీరో కార్తీకి రూ. కోటి చెక్ ఇచ్చిన ఉదయనిధి స్టాలిన్)
అదే కారణమా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలు.. సీఎం రేవంత్ రెడ్డితో పలుమార్లు భేటీ అయ్యారు. వీళ్లలో కొందరు కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి భేటీ కూడా అలాంటిదేనని మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్‌లో టికెట్ అశించి భంగపడ్డ ఈయన.. కాంగ్రెస్ లో చేరారని, అలానే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారట.
ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి పోటీలో నిలబడాలని అనుకుంటున్నారు. గతంలో ఆ స్థానానికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దృష్ట్యా.. ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే తన అల్లుడు అల్లు అర్జున్ క్రేజ్ కూడా కలిసివచ్చే అవకాశముంది.
(ఇదీ చదవండి: రామ్‌చరణ్‌ను కలిశా.. ఏం మాట్లాడానో అడగొద్దు: విశ్వక్ సేన్)
Comments
Please login to add a commentAdd a comment