టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న విజయారెడ్డి
సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్: టీఆర్‌ఎస్ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్, సీఎల్పీ మాజీ నేత పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్) కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శని వారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఆమె.. కాంగ్రెస్‌లో చేరే విషయమై చర్చించారు. తర్వా త రేవంత్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.
టీఆర్‌ఎస్‌లో ప్రజల తరఫున మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని, అందుకే ఆ పార్టీలో ఇమడలేకపోతున్నానని విజయారెడ్డి తెలిపా రు. తమ కుటుంబం ముందు నుంచీ కాంగ్రెస్ లోనే ఉందని, ఇప్పుడు ఆ పార్టీతో సాగితేనే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చానని చెప్పారు. ఈ నెల 23న తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు.
ఎమ్మెల్యే పదవి ఆశించి..
పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి 2009లో శేరిలిం గంపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్య ర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరి 2014లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ మరు సటి ఏడాదే టీఆర్‌ఎస్‌లో చేరారు. 2015లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినా..
అప్పుడే టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్‌కు టికెట్ ఇవ్వడంతో నిరాశ లో మునిగారు. 2019లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రెండోసారి ఖైరతాబాద్ కార్పొరేటర్ గా గెలిచిన ఆమె.. టీఆర్‌ఎస్ మేయర్‌గా అవకాశమిస్తుందని ఆశించారు. కానీ అవకాశం రాకపోవడంతో టీఆర్‌ఎస్‌కు దూరమవుతూ వచ్చారు. ఆ అసంతృప్తితోనే తాజాగా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment