
సాక్షి, ఖమ్మం టౌన్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మం కలెక్టరేట్‌లో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ హత్యను గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సేవకులు తీవ్రంగా ఖండించారు. నిరసనగా నగరంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద మానవహారం చేశారు. నిందితుడు సురేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.