డెనిమ్ ట్రెండీ.. | Denim trendy shoes fashion | Sakshi
Sakshi News home page

డెనిమ్ ట్రెండీ..

Published Tue, Aug 12 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

డెనిమ్ ట్రెండీ..

డెనిమ్ ట్రెండీ..

డెనిమ్... డ్రెస్‌ల్లో డిగ్నిఫైడ్‌గా ఒదిగిపోతుంది. పాదరక్షల్లో ఫంకీగా మారిపోతుంది. రూపుమారినా... చూపు తిప్పుకోనివ్వని ఘనత డెనిమ్‌దే. చలిలో వెచ్చగా, వేసవిలో వేడికి ఉపశమనంగా, వర్షంలో తడిసినా పాడవని డెనిమ్ షూ ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలకు హాట్ ఫేవరెట్ అయ్యింది.
 
 కాస్త ఫంకీగా, కొంత ట్రెండీగా కనిపించాలనుకునే కుర్రకారుకు నప్పేలా డెనిమ్‌తో కొత్త ప్రయోగాలు ప్రపంచమంతా జరుగుతున్నాయి. అందులో భాగంగా యువతను ఆకట్టుకునేలా డెనిమ్ చెప్పులు, శాండల్స్, బూట్లు సిటీకి వచ్చేశాయి. ఇవి జీన్స్, స్కర్టులాంటి ఆధునిక ధుస్తుల మీదికి అందంగా నప్పుతాయి.
 
 కిక్ ఇచ్చే కిక్స్...
 మైక్రో ఫైబర్‌తో రూపిందించే చెప్పులకు దీటుగా డెనిమ్ చెప్పులు, షూలలో రకరకాల డిజైన్లు, రంగులు వస్తున్నాయి. దీంతోపాటు పూసలు, రాళ్లు, కుందన్స్‌తో అదనపు అందాలను చేర్చడంతో ఇవి మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇక వీటిలో స్నీకర్స్, శాండల్స్, హీల్స్, బూట్లు, లోఫర్స్, కిక్స్, ఇలా అన్నింటిలోనూ డెనిమ్ అందాలున్నాయి. ఏ తరహా డ్రెస్‌లకైనా ఇవి చక్కగా సరిపోతాయి.
 
 ప్రత్యేకమైనవి...
 వర్షంలో తడిసినా పాడవుతాయన్న దిగులు లేదు. ఎన్నిసార్లు వేసినా మాసినట్లు కనిపించకపోవడమే వీటి ప్రత్యేకత. లెవిస్, నైక్ లాంటి బ్రాండ్‌లతో పాటు ఇతర అన్‌బ్రాండెడ్‌లోనూ ఎన్నో డిజైన్లలో కూడా    అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.500 నుంచి లభిస్తున్నాయి.  
 -  విజయారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement