జష్న్ - ఎ - నిఖా | Marriage is a most memorable in human life | Sakshi
Sakshi News home page

జష్న్ - ఎ - నిఖా

Published Sat, Sep 13 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

జష్న్ - ఎ - నిఖా

జష్న్ - ఎ - నిఖా

జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయే వేడుక పెళ్లి. ఈ పండుగను ఘనంగా నిర్వహించడానికి ఇంటిల్లిపాదీ శ్రమిస్తుంది. సంబంధాలు చూడటం మొదలు.. అప్పగింతలు అయ్యే వరకు ప్రతి ఘట్టం ఎంత అపురూపమైనదో.. అంత సున్నితమైనది కూడా. మ్యాట్రిమోనియల్ సర్వీస్ నుంచి.. ఇన్విటేషన్ కార్డ్ డిజైనర్స్.. ఫొటో, వీడియోగ్రాఫర్స్, టూర్ ఆపరేటర్స్, వెడ్డింగ్ కలెక్షన్స్ ఇలా పెళ్లి తంతులో ప్రధానమైన వాటన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చింది ‘జష్న్-ఎ-నిఖా’ ఎక్స్‌పో. ప్రత్యేకంగా ముస్లింల కోసం నాంపల్లిలోని సిటీ కన్వెన్షన్ సెంటర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోలోని వెరైటీలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, టీఆర్‌ఎస్ నాయకురాలు విజయారెడ్డి ఆసక్తిగా తిలకించారు. అత్తరు గుబాళింపు.. కళ్లు చెదిరే డ్రెస్సింగ్.. నవ వధువును మెరిపించే ఆభరణాలు... ఇవన్నీ నిఖాలో కనిపిస్తాయి. ముస్లింల కోసమే పత్య్రేకంగా వెడ్డింగ్ కలెక్షన్ ఎక్స్‌పో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఆదివారం వరకు కొనసాగే ఈ ఎక్స్‌పోలోని 70 స్టాల్స్‌లో జ్యువెలరీ, కాస్మొటిక్స్, డిజైనింగ్ వేర్ వంటివెన్నో ఉన్నారుు.  
 - శిరీష చల్లపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement