Mohamad ali
-
నుమాయిష్ షురూ
అఫ్జల్‌గంజ్: భాగ్యనగరంలో ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వనిత మహావిద్యాలయ విద్యార్థులు వందేమాతరం గీతాలాపన చేసిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. గత 79 ఏళ్ల నుంచి ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న సొసైటీ సభ్యులను మంత్రి మహమూద్ అలీ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్లో తెలంగాణ సంస్కృతైన గంగా జమునా తైజీబ్ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ఎగ్జిబిషన్‌ను కేవలం 45 రోజులకే పరిమితం చేయకుండా ఏడాదిలో పలుమార్లు నిర్వహిస్తే ఎందరికో ఉపాధి కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ ద్వారా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి తమ వస్తువులకు ప్రచారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు. తద్వారా జనవరి వచ్చిందంటే చాలు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందని అన్నారు. గతేడాది అగ్ని ప్రమాద అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఆదాయంతో 30 వేల మందికి విద్య.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రకాల ఉత్పత్తులతోపాటు ప్రముఖ కంపెనీల వస్తువులు ఎగ్జిబిషన్లో దొరుకుతాయని మంత్రి ఈటల అన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్‌తో కలసి రాష్ట్రంలోని 18 విద్యాలయాల ద్వారా ఏటా సుమారు 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతి సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక సంస్థగా ఎగ్జిబిషన్ సొసైటీ నిలుస్తుందని కొనియాడారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. గత అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అండర్‌గ్రౌండ్ వైరింగ్, వాటర్ సిస్టమ్తోపాటు మరెన్నో జాగ్రతలు తీసుకున్నామని అన్నారు. ఇక ఎగ్జిబిషన్‌కు అనుమతి ఆలస్యంగా రావడంతో స్టాల్స్ ఏర్పాటు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు ఎన్.సురేందర్, కోశాధికారి ఎన్.వినయ్‌కుమార్, సంయుక్త కార్యదర్శి బి.హన్మంతరావు, మెంబర్లు పాల్గొన్నారు. -
మండలిలో ప్రశ్నోత్తరాలు
ప్రభుత్వ పరిశీలనలో బ్రాహ్మణ కార్పొరేషన్ సాక్షి, హైదరాబాద్: బ్రాహ్మణ సామాజిక వర్గం కోసం ఆర్థిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. పేదరికంలో ఉన్న ఈ వర్గాల వారికి ఆరోగ్యశ్రీ, డబుల్ బెడ్రూం ఇళ్లు, కల్యాణలక్ష్మి వంటి అంశాలను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని చెప్పారు. అర్చకులు, ఇతర ఆలయ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు కాదని, అందువల్ల ప్రభుత్వ ఖజానా ద్వారా వేతనాలు చెల్లించే ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. ఆదివారం మండలిలో ఈ అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. రెండేళ్లలో పోలీస్ కమాండ్ నిర్మాణాలు: నాయిని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కేంద్రాన్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈ భవన సముదాయంలో ఏ-24, బీ-18, సీ-3, డీ-2 అంతస్తులు ఉంటాయన్నారు. పది జిల్లాలతో సమన్వయపరిచి, ఎక్కడేమి జరిగినా ఈ కేంద్రానికి వెంటనే సమాచారం అందేలా చేస్తామన్నారు. పోలీస్‌శాఖలో వివిధ పోస్టుల్లోని 10,269 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు ఇచ్చామని, ఈ ఏడాది చివర్లోగా అవి పూర్తవుతాయని చెప్పారు. సభ్యులు బివెంకటేశ్వర్లు, యాదవరెడ్డి వేసిన ప్రశ్నలపై మంత్రి స్పందించారు. మైనారిటీ సబ్‌ప్లాన్‌పై ఆలోచన: మహమూద్ అలీ మైనారిటీలకు కూడా సబ్‌ప్లాన్ తీసుకొచ్చే అంశంపై ఆలోచనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. అయితే ఇప్పటికిప్పుడైతే ఈ ప్రతిపాదనేది ప్రభుత్వం వద్ద లేదన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ బడ్జెట్లో ఖర్చు చేయకుండా మిగిలిపోయిన రూ.600 కోట్లకు మరో రూ.800 కోట్లు కలిపి వచ్చే ఏడాది నుంచి మైనారిటీ గురుకులాలకు ఖర్చు చేయబోతున్నట్లు వివరించారు. బడ్జెట్లో కేటాయించిన రూ.1,100 కోట్లలో రూ.466 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిపోయిన మొత్తాన్ని వచ్చే ఏడాది ఇస్తారా అని విపక్ష నేత షబ్బీర్ వేసిన ప్రశ్నపై ఆయన స్పందించారు. -
జష్న్ - ఎ - నిఖా
జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయే వేడుక పెళ్లి. ఈ పండుగను ఘనంగా నిర్వహించడానికి ఇంటిల్లిపాదీ శ్రమిస్తుంది. సంబంధాలు చూడటం మొదలు.. అప్పగింతలు అయ్యే వరకు ప్రతి ఘట్టం ఎంత అపురూపమైనదో.. అంత సున్నితమైనది కూడా. మ్యాట్రిమోనియల్ సర్వీస్ నుంచి.. ఇన్విటేషన్ కార్డ్ డిజైనర్స్.. ఫొటో, వీడియోగ్రాఫర్స్, టూర్ ఆపరేటర్స్, వెడ్డింగ్ కలెక్షన్స్ ఇలా పెళ్లి తంతులో ప్రధానమైన వాటన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చింది ‘జష్న్-ఎ-నిఖా’ ఎక్స్పో. ప్రత్యేకంగా ముస్లింల కోసం నాంపల్లిలోని సిటీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోలోని వెరైటీలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, టీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి ఆసక్తిగా తిలకించారు. అత్తరు గుబాళింపు.. కళ్లు చెదిరే డ్రెస్సింగ్.. నవ వధువును మెరిపించే ఆభరణాలు... ఇవన్నీ నిఖాలో కనిపిస్తాయి. ముస్లింల కోసమే పత్య్రేకంగా వెడ్డింగ్ కలెక్షన్ ఎక్స్పో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఆదివారం వరకు కొనసాగే ఈ ఎక్స్పోలోని 70 స్టాల్స్‌లో జ్యువెలరీ, కాస్మొటిక్స్, డిజైనింగ్ వేర్ వంటివెన్నో ఉన్నారుు. - శిరీష చల్లపల్లి