Denim
-
డెనిమ్ జీన్స్ అవుట్ ఫిట్ తో కృతి సనన్ స్టైలిష్ లుక్స్ (ఫొటోలు)
-
బ్రిటీష్ వారి లీ కూపర్ బ్రాండ్.. ఇప్పుడీ భారతీయ కంపెనీ సొంతం..
Iconix Lifestyle India: బ్రిటిష్ బ్రాండ్ లీ కూపర్ మేధోసంపత్తి హక్కులను భారత్‌లో ఐకానిక్స్ లైఫ్‌స్టైల్ ఇండియా దక్కించుకుంది. లీ కూపర్ ఉత్పత్తుల పంపిణీని విస్తృతం చేయడంతోపాటు బ్రాండ్ స్థానాన్ని మరింత పదిలపరిచేందుకు ఐకానిక్స్కు ఈ డీల్ దోహదం చేయనుంది. రిలయన్స్, ఐకానిక్స్ బ్రాండ్ సంయుక్తంగా ఐకానిక్స్ లైఫ్‌స్టైల్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. 1908 నుంచి స్వాతంత్రానికి పూర్వమే బ్రిటీష్ కంపెనీగా లీ కూపర్ బ్రాండ్ ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ బ్రాండ్ నుంచి వచ్చిన డెనిమ్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. 126 దేశాల్లో ఈ కంపెనీ విస్తరించింది. లేడీస్, జంట్స్, చిల్ట్రన్ ఇలా అన్ని కేటగిరిల్లో తమ ఉత్పత్తులను లీ కూపర్ అందుబాటులో ఉంచింది. తాజాగా ఈ కంపెనీకి చెందిన మేథో హక్కులను ముఖేశ్ అంబానీ ఆధీనంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి చెందిన రిలయన్స్ బ్రాండ్ లిమిటెడ్ (ఆర్బీఎల్) సొంతం చేసుకుంది. దీంతో లీ కూపర్ బ్రాండ్ మరింతగా భారతీయులకు చేరువ కానుంది. గతంలో గతంలో టాటా గ్రూపు ల్యాండ్‌రోవర్, జాగ్వార్ వంటి విదేశీ కంపెనీనలు చేజిక్కించుకుని సంచలనం సృష్టించింది. తాజాగా రిలయన్స్ సంస్థ సైతం అంతర్జాతీయ బ్రాండ్లను సొంతం చేసుకునే పనిలో ఉంది. -
డెనిమ్ గ్రూప్‌లో విప్రో వాటా అమ్మకం
న్యూఢిల్లీ: స్వతంత్ర అప్లికేషన్ సెక్యూరిటీ సంస్థ డెనిమ్ గ్రూప్‌లో పూర్తి వాటాను విక్రయించినట్లు ఐటీ సేవల దేశీ దిగ్గజం విప్రో లిమిటెడ్ తాజాగా వెల్లడించింది. వాటాను 22.42 మిలియన్ డాలర్ల(రూ. 160 కోట్లు)కు విక్రయించినట్లు తెలియజేసింది. 2018 మార్చిలో డెనిమ్ గ్రూప్, మేనేజ్మెంట్లో 33.33 శాతం వాటాను విప్రో కొనుగోలు చేసింది. ఇందుకు 8.83 మిలియన్ డాలర్లను వెచ్చించింది. ఇటీవల కోల్‌ఫైర్ సంస్థ డెనిమ్ గ్రూప్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో పూర్తి వాటాను విక్రయించినట్లు విప్రో వివరించింది. దీంతో ప్రస్తుతం డెనిమ్ గ్రూప్ పెట్టుబడుల నుంచి పూర్తిగా వైదొలగినట్లు తెలియజేసింది. కాగా.. మరోవైపు యూఎస్‌కు చెందిన ఐటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ కంపెనీ స్క్వాడ్క్యాస్ట్లో మైనారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందుకు 1.2 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. తద్వారా 20 శాతానికంటే తక్కువ వాటాను సొంతం చేసుకున్నట్లు తెలియజేసింది. జూన్ చివరికల్లా ఈ లావాదేవీ పూర్తికానున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో విప్రో షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 539 వద్ద ముగిసింది. -
పార్టీ లేదా పని.. దేనికైనా ‘డెనిమ్’
న్యూఢిల్లీ: దేశంలో వినియోగం పడిపోయిందని వింటున్నాం.. కానీ కొన్నింటికి డిమాండ్ బ్రహ్మాండంగా ఉంది. వాటిల్లో డెనిమ్ కూడా ఒకటి. పార్టీ అయినా, పనికి అయినా, క్యాజువల్ అయినా.. డెనిమ్ వస్త్రాలను ధరించేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. తక్కువ ధర, సౌకర్యం, కొత్త కొత్త డిజైన్లు ఇవన్నీ దీనికి కారణం. గడిచిన దశాబ్ద కాలంలో జీన్స్ మార్కెట్ పరిమాణం మూడొంతులు పెరిగి రూ.21,993 కోట్లకు చేరుకుందని యూరో మానిటర్ అనే సంస్థ నివేదిక తెలియజేసింది. ముఖ్యంగా 2018లో ఈ మార్కెట్ 14 శాతం వృద్ధి చెందింది. 2009 తర్వాత ఒక ఏడాదిలో ఈ స్థాయి వృద్ధి నమోదు కావడం మళ్లీ ఇదే. గత కొన్నేళ్లుగా డెనిమ్ అమ్మకాలు ఏటా 9–11 శాతం స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు అయిన జరా, హెచ్అండ్ఎం, జాక్ అండ్ జోన్స్, గ్యాప్ గత దశాబ్దంలో మార్కెట్ వృద్ధికి తోడ్పడ్డాయి. యువతే ప్రోత్సాహకం ‘‘మిలీనియల్స్ (1980–2000 మధ్య జన్మించిన వారు) కారణంగా పనిచేసే చోట సంస్కృతి మారిపోవడం, యువతకు డెనిమ్ ఏకరీతి వస్త్రధారణ కావడం ఈ సంస్కృతికి దారితీసింది. దీంతో ఇదొక మెగా ట్రెండ్‌గా మారింది’’ అని లెవిస్ ఇండియా ఎండీ సనీవ్ మొహంతి పేర్కొన్నారు. ఈ సంస్థ 2018–19లో అమ్మకాలను 25% పెంచుకుని రూ.1,104 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ‘‘ఫ్యాషన్ నుంచి డెనిమ్ ఎప్పటికీ బయటకు వెళ్లలేదు. ఇప్పుడు అవగాహన మరింత పెరిగింది. వేగంగా అమ్ముడుపోయే వాటికి బదులు విశ్వసనీయ బ్రాండ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ ఫ్యూచర్ రిటైల్ జాయింట్ ఎండీ రాకేశ్ బియానీ పేర్కొన్నారు. ఫ్యూచర్ రిటైల్ దేశవ్యాప్తంగా తనకున్న రిటైల్ దుకాణాల పరిధిలో ఏటా కోటి వరకు జీన్స్‌ను విక్రయిస్తోంది. ఫార్మల్ వస్త్ర ధారణకు బదులు స్మార్ట్ క్యాజువల్స్ను ధరించే ధోరణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లలో గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతోందని ఈ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. ముఖ్యంగా బోటమ్‌వేర్ (నడుము కింద ధరించే వస్త్రాలు) విషయంలో డెనిమ్కు బలమైన డిమాండ్ ఉన్నట్టు స్పైకర్ సీఈవో సంజయ్ వఖారియా తెలిపారు. ఎంపికలెన్నో... మోనోక్రోమ్ డెనిమ్, అథ్లీష్యూర్ డెనిమ్, ఫ్లేర్డ్ డెనిమ్, హైవెయిస్ట్ ఫిట్, క్యారట్ఫిట్ నుంచి గతంలో నడిచిన క్లాసిక్ క్యాలిఫోర్నియన్ ఫిట్, మైనింగ్ జీన్స్ వరకు... వినియోగదారులకు జీన్స్ విషయంలో విస్తృతమైన శ్రేణి అందుబాటులో ఉండడం వారికి సౌకర్యంగానూ, ఈ మార్కెట్ వృద్ధికి ఊతంగానూ ఉంటోంది. డెనిమ్స్కు సంబంధించి రంగులు, ఫిట్టింగ్, డిజైన్లు, కొత్త స్టయిల్స్ విషయంలో కంపెనీలు ఎన్నో ఆవిష్కరణలు తీసుకొస్తున్నట్టు లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ ఎండీ వసంత్‌కుమార్ అన్నారు. ‘‘అప్పారెల్, లైఫ్‌స్టయిల్ విభాగంలో వినియోగం మందగించని విభాగాల్లో డెనిమ్ కూడా ఒకటి. ఈ ఏడాది కూడా దీనికి డిమాండ్ ఎక్కువగానే ఉంది’’ అని అరవింద్ లైఫ్ స్టయిల్ బ్రాండ్స్ సీఈవో జే సురేష్ పేర్కొన్నారు. ఇతర విభాగాల్లో అమ్మకాలు క్షీణించినప్పటికీ.. అన్ని బ్రాండ్లలోనూ డెనిమ్ వస్త్రాల అమ్మకాలు స్థిరంగా 10–15 శాతం మధ్య పెరుగుతున్నట్టు ఆయన చెప్పారు. -
డెనిమిజమ్
వేడుకలో హైలైట్‌గా నిలవాలని ఎప్పుడూ ఓ కొత్త వేషధారణను ఎంచుకునేవారుంటారు. ఈ కాలానికి తగ్గట్టుగా నెటెడ్, బెనారస్, పట్టులతో ఎన్నో వేల డిజైన్లు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ కాలం ఆధునికంగా మెరవాలన్నా, సంప్రదాయంగా కళగా ఉండాలన్నా కుదరదు అని చలికి వణుకుతూ విసుక్కుంటారు. స్వెటర్ ధరిస్తే డ్రెస్ అందం పడిపోతుందని దిగులుపడుతుంటారు. చలికాలం ఈ సమస్య ఎదురుకాకుండా ‘డెనిమ్’ని కొత్తగా ధరించవచ్చు. స్టైల్‌గా వెలిగిపోవచ్చు. వేడుకలో హైలైట్‌గా నిలవాలని ఎప్పుడూ ఓ కొత్త వేషధారణను ఎంచుకునేవారుంటారు. ఈ కాలానికి తగ్గట్టుగా నెటెడ్, బెనారస్, పట్టులతో ఎన్నో వేల డిజైన్లు పుట్టుకొస్తున్నాయి. అయితే, ఈ కాలం ఆధునికంగా మెరవాలన్నా, సంప్రదాయంగా కళగా ఉండాలన్నా కుదరదు అని చలికి వణుకుతూ విసుక్కుంటారు. స్వెటర్ ధరిస్తే డ్రెస్ అందం పడిపోతుందని దిగులుపడుతుంటారు. చలికాలం ఈ సమస్య ఎదురుకాకుండా ‘డెనిమ్’ని కొత్తగా ధరించవచ్చు. స్టైల్‌గా వెలిగిపోవచ్చు. డెనిమ్ ప్యాంట్స్, జాకెట్స్ వరకే పరిమితం కాలేదు. ఇంకాస్త మోడ్రన్ కోరుకునేవారు షార్ట్, లాంగ్ గౌన్స్, షర్ట్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. సంప్రదాయాన్ని ఇష్టపడేవారు లెహంగాలు, చుడీదార్లు, అనార్కలీ ఫ్రాక్లను ధరించవచ్చు. డెనిమ్ ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. ఒకే రంగులోనే లైట్, డార్క్లతో చూపు తిప్పుకోనివ్వని డెనిమ్ని మరింత ఆకర్షణీయంగా రూపుకట్టవచ్చు అని నిరూపిస్తున్నారు నేటి డిజైనర్లు. డెనిమ్ ఒకటే.. వేల రూపాలు... ప్యాంటులు, స్కర్టులు, డ్రస్సులు, జాకెట్స్, షర్టులు, షార్ట్‌లు, సాక్స్, షూ, బ్యాగులు, టోపీలు.. ఇలా ఎన్నింటినో తయారు చేస్తున్నారు. డెనిమ్ క్లాత్‌తో డిజైనర్స్ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. చలికాలానికి స్టైల్‌గా, కంఫర్ట్‌గా అనిపించే డెనిమ్ ఇప్పుడు చూడచక్కగా కనుల ముందు నిలుస్తోంది. చలి నుంచి రక్షిస్తుంది. వాతావరణం వేడగా ఉన్నా పొట్టి పొట్టి డెనిమ్ దుస్తులు ధరించవచ్చు. అందుకే ప్రపంచమంతా కొన్నేళ్లుగా డెనిమ్ హల్చల్ చేస్తోంది. వరల్డ్ క్లాత్‌గా పేరుపడిపోయిన డెనిమ్‌తో విభిన్నమైన డిజైన్లు సృష్టించండి. ఇక వెచ్చగా మెరిసిపోండి. - ఎన్.ఆర్ డెనిమ్‌ను ఫ్రాన్స్ దేశంలో నిమెస్, ఆండ్రే కుటుంబం తయారుచేశారు. దీనినే సిర్గే డె నిమెస్ అనిపిలుస్తారు. ఈ పేరును ‘డెనిమ్’ అని సంక్షిప్తం చేశారు. ఇది గట్టిగా ఉండే కాటన్ వస్త్రం. దీంట్లో సాధారణంగా నీలిరంగు అద్దకం ఎక్కువ. ప్రస్తుతం అంతా వాడే జీన్స్ అనే పదం ఇటలీలోని జెనెస్ పదం నుండి వచ్చింది. మొదటి డెనిమ్ ప్యాంటులను ఇటలీలోనే తయారుచేసేవారు. డెనిమ్‌లో పొడి డెనిమ్, అంచు డెనిమ్, సాగే డెనిమ్, కలర్ డెనిమ్.. అంటూ విభిన్న రకాలు ఉన్నాయి. -
డెనిమ్ ట్రెండీ..
డెనిమ్... డ్రెస్ల్లో డిగ్నిఫైడ్‌గా ఒదిగిపోతుంది. పాదరక్షల్లో ఫంకీగా మారిపోతుంది. రూపుమారినా... చూపు తిప్పుకోనివ్వని ఘనత డెనిమ్దే. చలిలో వెచ్చగా, వేసవిలో వేడికి ఉపశమనంగా, వర్షంలో తడిసినా పాడవని డెనిమ్ షూ ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలకు హాట్ ఫేవరెట్ అయ్యింది. కాస్త ఫంకీగా, కొంత ట్రెండీగా కనిపించాలనుకునే కుర్రకారుకు నప్పేలా డెనిమ్‌తో కొత్త ప్రయోగాలు ప్రపంచమంతా జరుగుతున్నాయి. అందులో భాగంగా యువతను ఆకట్టుకునేలా డెనిమ్ చెప్పులు, శాండల్స్, బూట్లు సిటీకి వచ్చేశాయి. ఇవి జీన్స్, స్కర్టులాంటి ఆధునిక ధుస్తుల మీదికి అందంగా నప్పుతాయి. కిక్ ఇచ్చే కిక్స్... మైక్రో ఫైబర్‌తో రూపిందించే చెప్పులకు దీటుగా డెనిమ్ చెప్పులు, షూలలో రకరకాల డిజైన్లు, రంగులు వస్తున్నాయి. దీంతోపాటు పూసలు, రాళ్లు, కుందన్స్‌తో అదనపు అందాలను చేర్చడంతో ఇవి మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇక వీటిలో స్నీకర్స్, శాండల్స్, హీల్స్, బూట్లు, లోఫర్స్, కిక్స్, ఇలా అన్నింటిలోనూ డెనిమ్ అందాలున్నాయి. ఏ తరహా డ్రెస్లకైనా ఇవి చక్కగా సరిపోతాయి. ప్రత్యేకమైనవి... వర్షంలో తడిసినా పాడవుతాయన్న దిగులు లేదు. ఎన్నిసార్లు వేసినా మాసినట్లు కనిపించకపోవడమే వీటి ప్రత్యేకత. లెవిస్, నైక్ లాంటి బ్రాండ్లతో పాటు ఇతర అన్బ్రాండెడ్లోనూ ఎన్నో డిజైన్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.500 నుంచి లభిస్తున్నాయి. - విజయారెడ్డి