
సాక్షి, విశాఖపట్నం : కాంగ్రెస్ మాజీ మహిళ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యలో ఇద్దరు దుండగుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రక్తపు మడుగులో ఓ బూటు.. మరో చెప్పు ముద్రలున్నట్లు పోలీసులు తెలిపారు. అవి పాత నేరస్థుడు హేమంత్‌కు సంబంధించినవి అయి ఉంటాయన్న అనుమానంతో అతని కోసం గాలింపు చేపట్టారు. నిన్నటి వరకు భీమిలి పరిసరాల్లో ఉన్నట్లు మొబైల్ సిగ్నల్స్ ద్వారా గుర్తించామన్నారు. హత్య విషయాన్ని దృష్టి మరల్చేందుకే ఇంటికి తాళం వేసి కారును తీసుకెళ్లి ఉంటాడని తెలిపారు. హత్యానంతరం నిందితుడు బయటకు వెళ్లి మళ్లీ విజయారెడ్డి ఇంటికి వచ్చినట్టు ఆనవాళ్లను గుర్తించామన్నారు. కేసు దర్యాప్తు కోసం ఆరు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టు సీపీ లడ్డా పేర్కొన్నారు.