అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురికావడంతో ఆమె భర్త సుభాష్‌రెడ్డి కన్నీరు మున్నీరవుతున్నారు. తన భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆయన రోదిస్తున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. హత్య చేసిన వాళ్ల వెనకాల భూ కబ్జాదారులు ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వం విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.