సాక్షి, హైదరాబాద్: కేవలం ఐదే నిమిషాల్లో ఓ రైలు మొత్తానికి నీటిని నింపే ఆధునిక వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. రైలులోని ప్రతి బోగీలో 1,600 లీటర్ల సామర్థ్ధ్యముండే నీటి ట్యాంకు ఉంటుంది. రైలులోని మొత్తం బోగీల్లో కలిపి సుమారు 40 వేల లీటర్ల నీటిని నింపుతారు. ఇలా ట్యాంకులన్నీ నింపేందుకు గతంలో చాలా సమయం పట్టేది. పెద్దమొత్తంలో నీళ్లు వృథా అయ్యేవి కూడా. ఇప్పుడు సమయం ఆదా కావటంతోపాటు నీటి వృథాను అరికట్టేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొలుత సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రారంభించారు. రిమోట్ ద్వారా నిర్వహించే ఈ వ్యవస్థ కంట్రోల్ ప్యానెల్ ప్లాట్‌ఫామ్ చివరన ఉంటుంది. లోడును బట్టి పంపుల ద్వారా విడుదలయ్యే నీటి ఒత్తిడిని నియంత్రించేలా ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేశారు. 20 హెచ్‌పీ సామర్థ్యంతో నిమిషానికి వంద క్యూబిక్ మీటర్ల నీటిని సరఫరా చేసే పంపులను అమర్చారు.
Comments
Please login to add a commentAdd a comment