చాలామంది కార్లను భలే మెయింటెయిన్ చేస్తారు. కొందరు లగ్జరీ కార్లను ఎంచుకుంటే..మరికొందరూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కార్లను ఇష్టపడతారు. అయితే కొంతమంది పెద్ద సౌండ్‌లు వచ్చే కార్లను ఇష్టపడతారు. వాళ్లకు తమ ఇంజిన్ల నుంచి వచ్చే సౌండ్‌లు అదిరిపడేలా ఉంటేనే వారికి మంచి కిక్ అన్న ఫీల్‌లో ఉంటారు. అయితే తాజా అధ్యయనంలో పెద్ద శబ్దాలు వచ్చే కార్లను ఇష్టపడే వారిలో ఆ టైపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయిని వెల్లడయ్యింది. అంతేగాదు దీని గురించి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.
కారు ఇంజిన్ల శబ్దం ఎక్కువగా ఇష్టపడే వారి జీవన విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. తమ కారు శబ్దమే అధికంగా ఉండాలనుకుని మార్పులు కూడా చేసుకుంటారట కొందరు. అలాంటి వారిలో అధిక స్థాయిలో శాడిజం, సైకో మనస్తత్వం ఎక్కుగవగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మేరకు కెనడాలోని వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త జూలీ ఐట్కెమ్ షెర్మెర్ నేతృత్వంలోని బృందం దీనిపై అధ్యయనం చేయగా..బిగ్గరగా శబ్దం వచ్చే కార్లను ఇష్టపడే వారి మనస్తత్వం చాలా వైరైటీగా ఉంటుందని తేలింది.
అందుకోసం దాదాపు 500 మందికి పైగా వ్యక్తలపై అధ్యయనం నిర్వహించారు. మనుషులకు, జంతువులకు ఇబ్బంది కలిగించే పరిధిలో శబ్బాలను ఇష్టపడేవారిలో మనసు చాలా భయనకంగా ఉంటుందట. ఈ పరిశోధన పాల్గొన్న వారిలో దాదాపు 52% మంది పురుషులకు బిగ్గరగా శబ్దం వచ్చే కార్లకు ప్రాధాన్యత ఇచ్చారట. వారిలో ఇతరుల భావలకు విలువ ఇవ్వని నిర్లక్ష్య పూరిత మనస్తత్వం క్లియర్‌గా కనిపించిందట.
ప్రజలు ఆ శబ్దాలను చూసి ఇబ్బందిపడుతుంటే..వారు ఆనందిస్తూ కిక్‌గా ఫీలవ్వుతారట. వారిలో ఇలాంటి సైకోపతి, శాడిజం లక్షణాలు ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. పరిశోధకులు జరిపిన ఈ పరిశోధనను 'ఎ డిజైర్ ఫర్ ఎ లౌడ్ కార్ విత్ మోడిఫైడ్ మఫ్లర్ ఈజ్ ప్రిడిక్డ్ బై ఏ మ్యాన్ అండ్ హైయర్ స్కోర్ ఆన్ సైకోపతి అండ్ శాడిజం' అనే పేరుతో అంతర్జాతీయ జర్నల్ కరెంట్ ఇష్యూస్ ఇన్ పర్సనాలిటీ సైకాలజీలో ప్రచురితమయ్యింది కూడా.
(చదవండి: ఉంగరంతో ఆరోగ్యం పదిలం!)
Comments
Please login to add a commentAdd a comment