loud
-
‘లౌడ్ లర్నింగ్’.. స్కిల్స్ నేర్చుకునేందుకు ఇదే మంత్రం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రొఫెషనల్స్ తమ కెరీర్లో ముందుకు వెళ్లాలంటే కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవడం అత్యంత ఆవశ్యకరం. అయితే అందరూ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారా.. ఇందులో ఎదురవుతున్న అడ్డంకులు ఏంటి.. అన్నదానిపై ప్రొఫెషనల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ ఓ పరిశోధన చేసింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.భారత్‌లో 80 శాతం మంది నిపుణులు తమ సంస్థ అభ్యసన సంస్కృతిని పెంపొందించడానికి తగినంత కృషి చేస్తోందని చెప్పారు. అయితే 10లో 9 మందికి పైగా (94%) పని, కుటుంబ కట్టుబాట్ల కారణంగా నైపుణ్యాలు నేర్చుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం కష్టపడున్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కుటుంబ బాధ్యతలు లేదా ఇతర వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా సమయం లేకపోవడం (34 శాతం), బిజీ వర్క్ షెడ్యూల్స్ (29 శాతం), అభ్యాస వనరులు అందుబాటులో లేవపోవడం (26 శాతం) వంటి ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయి.ఏంటీ 'లౌడ్ లెర్నింగ్'? అప్ స్కిల్లింగ్ కు అడ్డంకులను అధిగమించడానికి ప్రొఫెషనల్స్ లౌడ్ లర్నింగ్ అనే మంత్రాన్నిపాటిస్తున్నారు. పని చేసే చోట అభ్యసన ఆకాంక్షల గురించి బయటకు చెప్పడమే 'లౌడ్ లెర్నింగ్'. అప్ స్కిల్లింగ్ అడ్డంకులకు ఒక ఆశాజనక పరిష్కారంగా ఉద్భవించింది. భారత్‌లో 10లో 8 మంది (81 శాతం) ప్రొఫెషనల్స్ ఈ అభ్యాసం వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సమయాన్ని కేటాయించడానికి సహాయపడుతుందని చెప్పారు.'లౌడ్ లెర్నింగ్'లో మూడు ప్రధాన మార్గాలను భారత్‌లోని ప్రొఫెషనల్స్ పాటిస్తున్నారు. తమ అభ్యసనలను సహచరులతో పంచుకోవడం (40 శాతం), అభ్యసన ప్రయాణం లేదా విజయాలను లింక్డ్ఇన్లో షేర్ చేయడం (40శాతం), తమ లర్నింగ్ టైమ్ బ్లాక్‌ల గురించి వారి టీమ్ సభ్యులకు తెలియజేయడం (35శాతం) ఇందులో ఉన్నాయి. భారత్ లో ఇప్పటికే 64 శాతం మంది ప్రొఫెషనల్స్ ఈ 'లౌడ్ లెర్నింగ్ 'లో నిమగ్నమయ్యారు. -
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
చాలామంది కార్లను భలే మెయింటెయిన్ చేస్తారు. కొందరు లగ్జరీ కార్లను ఎంచుకుంటే..మరికొందరూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కార్లను ఇష్టపడతారు. అయితే కొంతమంది పెద్ద సౌండ్లు వచ్చే కార్లను ఇష్టపడతారు. వాళ్లకు తమ ఇంజిన్ల నుంచి వచ్చే సౌండ్లు అదిరిపడేలా ఉంటేనే వారికి మంచి కిక్ అన్న ఫీల్‌లో ఉంటారు. అయితే తాజా అధ్యయనంలో పెద్ద శబ్దాలు వచ్చే కార్లను ఇష్టపడే వారిలో ఆ టైపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయిని వెల్లడయ్యింది. అంతేగాదు దీని గురించి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.కారు ఇంజిన్ల శబ్దం ఎక్కువగా ఇష్టపడే వారి జీవన విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. తమ కారు శబ్దమే అధికంగా ఉండాలనుకుని మార్పులు కూడా చేసుకుంటారట కొందరు. అలాంటి వారిలో అధిక స్థాయిలో శాడిజం, సైకో మనస్తత్వం ఎక్కుగవగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మేరకు కెనడాలోని వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త జూలీ ఐట్కెమ్ షెర్మెర్ నేతృత్వంలోని బృందం దీనిపై అధ్యయనం చేయగా..బిగ్గరగా శబ్దం వచ్చే కార్లను ఇష్టపడే వారి మనస్తత్వం చాలా వైరైటీగా ఉంటుందని తేలింది. అందుకోసం దాదాపు 500 మందికి పైగా వ్యక్తలపై అధ్యయనం నిర్వహించారు. మనుషులకు, జంతువులకు ఇబ్బంది కలిగించే పరిధిలో శబ్బాలను ఇష్టపడేవారిలో మనసు చాలా భయనకంగా ఉంటుందట. ఈ పరిశోధన పాల్గొన్న వారిలో దాదాపు 52% మంది పురుషులకు బిగ్గరగా శబ్దం వచ్చే కార్లకు ప్రాధాన్యత ఇచ్చారట. వారిలో ఇతరుల భావలకు విలువ ఇవ్వని నిర్లక్ష్య పూరిత మనస్తత్వం క్లియర్‌గా కనిపించిందట. ప్రజలు ఆ శబ్దాలను చూసి ఇబ్బందిపడుతుంటే..వారు ఆనందిస్తూ కిక్‌గా ఫీలవ్వుతారట. వారిలో ఇలాంటి సైకోపతి, శాడిజం లక్షణాలు ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. పరిశోధకులు జరిపిన ఈ పరిశోధనను 'ఎ డిజైర్ ఫర్ ఎ లౌడ్ కార్ విత్ మోడిఫైడ్ మఫ్లర్ ఈజ్ ప్రిడిక్డ్ బై ఏ మ్యాన్ అండ్ హైయర్ స్కోర్ ఆన్ సైకోపతి అండ్ శాడిజం' అనే పేరుతో అంతర్జాతీయ జర్నల్ కరెంట్ ఇష్యూస్ ఇన్ పర్సనాలిటీ సైకాలజీలో ప్రచురితమయ్యింది కూడా.(చదవండి: ఉంగరంతో ఆరోగ్యం పదిలం!) -
బ్రిటీష్ వార్‌షిప్‌ల గురించి సంచలన నిజాలు
లండన్: బ్రిటన్ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే వార్‌షిప్‌ల గురించి ఇటీవల వెల్లడైన విషయాలు ఆ దేశ పౌరులను విస్తుపోయేలా చేశాయి. స్వయంగా ఆదేశ నావీ అధికారి క్రిస్ పారీ.. తమ వార్‌షిప్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా టైప్ 45 డిస్ట్రాయర్ వార్‌షిప్‌లు విడుదల చేసే సౌండ్ మరీ ఎక్కువగా ఉందని క్రిస్ పారీ తెలిపారు. వీటి సౌండ్‌ను 100 మైళ్ల దూరంలో ఉన్న రష్యా సబ్మెరైన్లు గుర్తించగలవని ఆయన వెల్లడించారు. ఇలాంటి లోపాలను చాలా ఏళ్లుగా పట్టించుకోకుండా వదిలేసినట్లు ఆయన తెలిపారు. 1.2 బిలియన్ పౌండ్లు వెచ్చించిన వాచ్కీపర్ డ్రోన్లు సైతం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడం ఆ దేశ రక్షణ అధికారుల్లోఅసంతృప్తిని మిగిల్చింది. క్రిస్ పారీ గతంలో బ్రిటన్ డిఫెన్స్ మినిస్ట్రీకి ఆపరేషనల్ కేపబిలిటీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.