sadism
-
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
చాలామంది కార్లను భలే మెయింటెయిన్ చేస్తారు. కొందరు లగ్జరీ కార్లను ఎంచుకుంటే..మరికొందరూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కార్లను ఇష్టపడతారు. అయితే కొంతమంది పెద్ద సౌండ్లు వచ్చే కార్లను ఇష్టపడతారు. వాళ్లకు తమ ఇంజిన్ల నుంచి వచ్చే సౌండ్లు అదిరిపడేలా ఉంటేనే వారికి మంచి కిక్ అన్న ఫీల్‌లో ఉంటారు. అయితే తాజా అధ్యయనంలో పెద్ద శబ్దాలు వచ్చే కార్లను ఇష్టపడే వారిలో ఆ టైపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయిని వెల్లడయ్యింది. అంతేగాదు దీని గురించి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.కారు ఇంజిన్ల శబ్దం ఎక్కువగా ఇష్టపడే వారి జీవన విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. తమ కారు శబ్దమే అధికంగా ఉండాలనుకుని మార్పులు కూడా చేసుకుంటారట కొందరు. అలాంటి వారిలో అధిక స్థాయిలో శాడిజం, సైకో మనస్తత్వం ఎక్కుగవగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మేరకు కెనడాలోని వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త జూలీ ఐట్కెమ్ షెర్మెర్ నేతృత్వంలోని బృందం దీనిపై అధ్యయనం చేయగా..బిగ్గరగా శబ్దం వచ్చే కార్లను ఇష్టపడే వారి మనస్తత్వం చాలా వైరైటీగా ఉంటుందని తేలింది. అందుకోసం దాదాపు 500 మందికి పైగా వ్యక్తలపై అధ్యయనం నిర్వహించారు. మనుషులకు, జంతువులకు ఇబ్బంది కలిగించే పరిధిలో శబ్బాలను ఇష్టపడేవారిలో మనసు చాలా భయనకంగా ఉంటుందట. ఈ పరిశోధన పాల్గొన్న వారిలో దాదాపు 52% మంది పురుషులకు బిగ్గరగా శబ్దం వచ్చే కార్లకు ప్రాధాన్యత ఇచ్చారట. వారిలో ఇతరుల భావలకు విలువ ఇవ్వని నిర్లక్ష్య పూరిత మనస్తత్వం క్లియర్‌గా కనిపించిందట. ప్రజలు ఆ శబ్దాలను చూసి ఇబ్బందిపడుతుంటే..వారు ఆనందిస్తూ కిక్‌గా ఫీలవ్వుతారట. వారిలో ఇలాంటి సైకోపతి, శాడిజం లక్షణాలు ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. పరిశోధకులు జరిపిన ఈ పరిశోధనను 'ఎ డిజైర్ ఫర్ ఎ లౌడ్ కార్ విత్ మోడిఫైడ్ మఫ్లర్ ఈజ్ ప్రిడిక్డ్ బై ఏ మ్యాన్ అండ్ హైయర్ స్కోర్ ఆన్ సైకోపతి అండ్ శాడిజం' అనే పేరుతో అంతర్జాతీయ జర్నల్ కరెంట్ ఇష్యూస్ ఇన్ పర్సనాలిటీ సైకాలజీలో ప్రచురితమయ్యింది కూడా.(చదవండి: ఉంగరంతో ఆరోగ్యం పదిలం!) -
నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది: చంద్రబాబు
సాక్షి, అన్నమయ్య/చిత్తూరు: చంద్రబాబు నాయుడిలో పరాకాష్టానికి చేరిన ఉన్మాదం మరోసారి బయటపడింది. శుక్రవారం అంగళ్లులో తన పర్యటనతో కల్లోల పరిస్థితికి కారణమైన ఆయన.. టీడీపీ కార్యకర్తలను నిలువరించాల్సిందిపోయి ఇంకా రెచ్చిపోయేలా మాట్లాడారు. పచ్చ దండును ఉసిగొల్పి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలతో పాటు అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్ సిబ్బందిపైనా దాడులు జరిపించి ఉద్రిక్తతలకు కారణం అయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూర్లోనూ ఉద్రికత్తలకు కారణమైంది. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల దాడిలో ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరు వైఎస్సార్సీపీ కార్యకర్తలూ గాయపడ్డారు. ఈ క్రమంలో.. అధికార పక్షానికి సవాల్ పేరిట ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారు. తమాషాలు చేస్తున్నారా నా కొడుకులు అంటూనే.. తరమండిరా అంటూ టీడీపీ కార్యకర్తలకు హుకుం జారీ చేశాడు. ‘‘టైం చెప్పండి.. ప్లేస్ చెప్పండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం.’’ ‘‘నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా. బాంబులకే భయపడలేదు. నన్ను బెదిరించడం.. మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు’’. ‘‘కర్రలతో వస్తే కర్రలతో వస్తా.. రౌడీలకు రౌడీగా ఉంటా, ఏయ్ పోలీస్ వాళ్లను పంపించూ’’ అంటూ తన బావ బాలయ్య రేంజ్లో డైలాగులు పేల్చాడు. ఈ క్రమంలో డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ.. ఆ బట్టలు తీసేయండయ్యా.. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాను మాత్రం సిబ్బందితో షీల్డ్ అడ్డుపెట్టించున్నారు. నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది. దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా భయపడేది లేదు. నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ని. మగాళ్లైతే పోలీసులు లేకుండా రండి.. తేల్చుకుందాం. ఏయ్ పోలీస్ బట్టలిప్పూ.. రోషం లేని జీవితం నాశనం. మీ పతనం చూసేవరకు వెంటపడతా.. అంటూ పుంగనూరులో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ నినాదాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో టీడీపీ గూండాలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా దాడులకు తెగబడ్డారు. ఓపెన్ టాప్ వాహనంలో చంద్రబాబు తన కార్యకర్తలను ఉద్దేశించి పరిస్థితిని మరింత దిగజార్చేలా మాట్లాడడం గమనార్హం. -
AP: బాబుగారి ఖాతా అలాగే ఉంటుంది మరి!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి నుంచి మంచి ఆశించడం కష్టమే. ప్రజల బాగోగులన్నా. ప్రాణాలన్నా ఆయనకసలు లెక్క లేదు. అధికార దాహంతో ఆయనలోని శాడిజం తారా స్థాయికి చేరింది. మరి చేసిన పాపాలు ఊరికనే పోతాయా?.. అందుకే అధికారం దూరమై.. ప్రభుత్వంపై విషం కక్కుతూ విద్వేషంతో రగిలిపోతున్నారు. ► నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన ఇదేం ఖర్మా సభలో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించకుండా.. ‘‘నేను ఆస్పత్రికి నుంచి వచ్చే సరికి తమ్ముళ్లూ మీరు ఇక్కడే వెయిట్ చేయాలంటూ’’ తన అసలు బుద్ధి బయట పెట్టుకున్నాడు. ► గుంటూరులో నిర్వహించిన చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు. ‘‘సార్ మీ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు’’ అని టీడీపీ నేతలు చెబితే.. ఏమాత్రం పట్టించుకోకుండా గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ► గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. మీ వల్లే కదా 29 మంది చనిపోయారంటే.. ‘‘పూరి జగన్నాథ రధయాత్రలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోలేదా?’’ అని వితండవాదం చేశాడు. కనీసం చనిపోయిన వారి కుటుంబాలకు వెళ్లి పరామర్శ కూడా చేయలేదు ► తాజాగా జమ్మలమడుగులో చంద్రబాబు సభ జరుగుతుండగానే.. వెనకాల మంటలు చెలరేగాయి. జాగ్రత్తలు చెప్పాల్సిన చంద్రబాబు ‘‘తక్కువ ధరకే నాణ్యమైన మందు’’ ఇస్తానంటూ స్పీచ్ దంచి వెళ్లిపోయాడు. మీ సభలకు జనాలు రావడం లేదు కాబట్టి మీరే ఇలాంటి ప్రమాదాలు డిజైన్ చేసి ఉంటారేమో... లేదా మీ దరిద్రపు పాదం దెబ్బకు అప్పట్లో గోదావరి పుష్కరాల సమయంలో ఒక ప్రమాదం..మొన్న గుంటూరులో చీరల పంపిణీలో ఇంకోటి.. ఇంకా కందుకూరు లో మీ పాద మహిమకు నలిగిపోయిన ప్రాణాలు మాదిరి ఇది నిజంగానే ఇంకో ప్రమాదమా ?… https://t.co/OvGJCSnd6V — YSR Congress Party (@YSRCParty) August 2, 2023 -
పాక్ దుశ్చర్యపై ఐసీజేను ఆశ్రయిస్తాం!
కార్గిల్ యుద్ధంలో భారత సైన్యాధికారిని చిత్రహింసలుపెట్టి హతమార్చిన పాక్ ఆర్మీ సుప్రీంకోర్టు అనుమతిస్తే.. అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తామన్న కేంద్రం న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో తమకు బందీగా చిక్కిన భారతీయ సైన్యాధికారి కెప్టెన్ సౌరభ్ కాలియాను పాక్ దళాలు చిత్రహింసలు పెట్టి దారుణంగా హతమార్చిన ఘటనకు సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించాలని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి అనుమతి కోరాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా, కామన్వెల్త్ నిబంధనల ప్రకారం.. ఆ కూటమి సభ్య దేశాలుగా భారత్, పాక్‌లు సాయుధ సంఘర్షణలు సహా ఏ విషయంపైనైనా ఐసీజేను ఆశ్రయించకూడదు. యూపీఏ ప్రభుత్వం కూడా గతంలో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ కేసు విషయంలో ఐసీజే ముందుకు వెళ్లేందుకు నిస్సహాయత వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌ను సమర్పించింది. ఇదే విషయాన్ని గత ఏడాది ప్రస్తుత విదేశాంగ సహాయ మంత్రి వీకే సింగ్ కూడా పార్లమెంటుకు విన్నవించారు. అయితే, కేసులోని ‘అసాధారణత్వా’న్ని పరిగణనలోకి తీసుకుని ఈ కేసును ఐసీజే ముందుకు తీసుకెళ్లే విషయంపై తీవ్రంగా చర్చించిన ప్రస్తుత కేంద్ర కేబినెట్.. సానుకూల నిర్ణయం తీసుకుంది. ఈ అంశాన్ని ఐసీజే ముందుకు తీసుకెళ్లడానికి సంబంధించి అవసరమైన న్యాయపర అనుమతిపై ఆదేశాలివ్వాల్సిందిగా సుప్రీంను కోరాలని నిర్ణయించిందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్‌లు సోమవారం వేర్వేరుగా వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టత కోరుతూ ఆగస్ట్ 25 లోగా అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది. కనుగుడ్లను పీకేసి, మర్మాంగాలను కోసేసి.. 1999, మే 15న కశ్మీర్‌లోని కార్గిల్‌లో గస్తీకి వెళ్తిన కాలియా, మరో ఐదుగురు జవాన్లను సజీవంగా పట్టుకున్న పాక్ ఆర్మీ.. వారిని దారుణమైన చిత్రహింసలకు గురిచేసి, 15 రోజుల తర్వాత వారి మృతదేహాలను భారత్‌కు అప్పగించింది. కాలియా మర్మాంగాలను కోసేసి, కనుగుడ్లను పీకేసి, కాళ్లు, చేతులు నరికేసి, వేడి ఇనుప చువ్వను చెవిలో దూర్చి, దంతాలను పీకేసి.. అత్యంత పాశవికంగా చంపారు. కాలియా దేహంలోని అన్ని ఎముకలు విరిగిపోయి ఉన్నాయి. మృతదేహాలను చూసిన భారత్‌లో పాక్‌పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై అంతర్జాతీయ దర్యాప్తు కోరుతూ కాలియా తండ్రి ఎన్కే కాలియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.