ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి నుంచి మంచి ఆశించడం కష్టమే. ప్రజల బాగోగులన్నా. ప్రాణాలన్నా ఆయనకసలు లెక్క లేదు. అధికార దాహంతో ఆయనలోని శాడిజం తారా స్థాయికి చేరింది. మరి చేసిన పాపాలు ఊరికనే పోతాయా?.. అందుకే అధికారం దూరమై.. ప్రభుత్వంపై విషం కక్కుతూ విద్వేషంతో రగిలిపోతున్నారు.
► నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన ఇదేం ఖర్మా సభలో తొక్కిసలాట జరిగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించకుండా.. ‘‘నేను ఆస్పత్రికి నుంచి వచ్చే సరికి తమ్ముళ్లూ మీరు ఇక్కడే వెయిట్ చేయాలంటూ’’ తన అసలు బుద్ధి బయట పెట్టుకున్నాడు.
► గుంటూరులో నిర్వహించిన చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు.
‘‘సార్ మీ సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయారు’’ అని టీడీపీ నేతలు చెబితే.. ఏమాత్రం పట్టించుకోకుండా గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయాడు.
► గోదావరి పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. మీ వల్లే కదా 29 మంది చనిపోయారంటే.. ‘‘పూరి జగన్నాథ రధయాత్రలో తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోలేదా?’’ అని వితండవాదం చేశాడు. కనీసం చనిపోయిన వారి కుటుంబాలకు వెళ్లి పరామర్శ కూడా చేయలేదు
► తాజాగా జమ్మలమడుగులో చంద్రబాబు సభ జరుగుతుండగానే.. వెనకాల మంటలు చెలరేగాయి.
జాగ్రత్తలు చెప్పాల్సిన చంద్రబాబు ‘‘తక్కువ ధరకే నాణ్యమైన మందు’’ ఇస్తానంటూ స్పీచ్ దంచి వెళ్లిపోయాడు.
మీ సభలకు జనాలు రావడం లేదు కాబట్టి మీరే ఇలాంటి ప్రమాదాలు డిజైన్ చేసి ఉంటారేమో... లేదా మీ దరిద్రపు పాదం దెబ్బకు అప్పట్లో గోదావరి పుష్కరాల సమయంలో ఒక ప్రమాదం..మొన్న గుంటూరులో చీరల పంపిణీలో ఇంకోటి.. ఇంకా కందుకూరు లో మీ పాద మహిమకు నలిగిపోయిన ప్రాణాలు మాదిరి ఇది నిజంగానే ఇంకో ప్రమాదమా ?… https://t.co/OvGJCSnd6V
— YSR Congress Party (@YSRCParty) August 2, 2023
Comments
Please login to add a commentAdd a comment