సాక్షి, అన్నమయ్య/చిత్తూరు: చంద్రబాబు నాయుడిలో పరాకాష్టానికి చేరిన ఉన్మాదం మరోసారి బయటపడింది. శుక్రవారం అంగళ్లులో తన పర్యటనతో కల్లోల పరిస్థితికి కారణమైన ఆయన.. టీడీపీ కార్యకర్తలను నిలువరించాల్సిందిపోయి ఇంకా రెచ్చిపోయేలా మాట్లాడారు. పచ్చ దండును ఉసిగొల్పి.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో పాటు అడ్డుకునేందుకు యత్నించిన పోలీస్ సిబ్బందిపైనా దాడులు జరిపించి ఉద్రిక్తతలకు కారణం అయ్యారు.
టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలోని అంగళ్లు, చిత్తూరు జిల్లా పుంగనూర్‌లోనూ ఉద్రికత్తలకు కారణమైంది. పుంగనూరులో టీడీపీ కార్యకర్తల దాడిలో ఇద్దరు ఎస్సైలు, పది మంది కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. రెండు వాహనాలకు నిప్పు పెట్టారు. కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలూ గాయపడ్డారు. ఈ క్రమంలో.. అధికార పక్షానికి సవాల్ పేరిట ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడారు.
తమాషాలు చేస్తున్నారా నా కొడుకులు అంటూనే.. తరమండిరా అంటూ టీడీపీ కార్యకర్తలకు హుకుం జారీ చేశాడు. ‘‘టైం చెప్పండి.. ప్లేస్ చెప్పండి.. ఎవరు గెలుస్తారో చూద్దాం.’’ ‘‘నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టా. బాంబులకే భయపడలేదు. నన్ను బెదిరించడం.. మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు’’. ‘‘కర్రలతో వస్తే కర్రలతో వస్తా.. రౌడీలకు రౌడీగా ఉంటా, ఏయ్ పోలీస్ వాళ్లను పంపించూ’’ అంటూ తన బావ బాలయ్య రేంజ్‌లో డైలాగులు పేల్చాడు.
ఈ క్రమంలో డీఎస్పీ కేశప్పను ఉద్దేశిస్తూ.. ఆ బట్టలు తీసేయండయ్యా.. అందరూ పెయిడ్ ఆర్టిస్టులే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తాను మాత్రం సిబ్బందితో షీల్డ్ అడ్డుపెట్టించున్నారు. నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది. దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా భయపడేది లేదు. నేను ఎన్‌ఎస్‌జి ప్రొటెక్టివ్‌ని. మగాళ్లైతే పోలీసులు లేకుండా రండి.. తేల్చుకుందాం. ఏయ్ పోలీస్ బట్టలిప్పూ.. రోషం లేని జీవితం నాశనం. మీ పతనం చూసేవరకు వెంటపడతా.. అంటూ పుంగనూరులో చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు గో బ్యాక్ నినాదాలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పర్యటనను అడ్డుకునేందుకు యత్నించారు. ఆ సమయంలో టీడీపీ గూండాలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినకుండా దాడులకు తెగబడ్డారు. ఓపెన్ టాప్ వాహనంలో చంద్రబాబు తన కార్యకర్తలను ఉద్దేశించి పరిస్థితిని మరింత దిగజార్చేలా మాట్లాడడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment