సైకో చేతిలో బాలుడు హత్యకు గురైన సంఘటన గురువారం పెరియపాలెంలో జరిగింది. పెరియపాలెం సమీపంలోని అవాంజివాక్కం గ్రామానికి
గుమ్మిడిపూండి: సైకో చేతిలో బాలుడు హత్యకు గురైన సంఘటన గురువారం పెరియపాలెంలో జరిగింది. పెరియపాలెం సమీపంలోని అవాంజివాక్కం గ్రామానికి చెందిన మురుగన్ కుమారుడు హేమనాథ్‌కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. బుధవారం రాత్రి మురుగన్ ఇంట్లో నిద్రపోయారు. ఇదిలాఉండగా అర్ధరాత్రి సమయంలో లేచిన మురుగన్‌కు పక్కనే పడుకున్న కుమారుడు హేమనాథ్ కనపడలేదు. దీంతో ఆయన చుట్టుపక్కల వారి సహాయంతో వెతకడం ప్రారంభించారు.
అయినా ఫలితం లేకపోవడంతో బంధువుల అబ్బాయి తమిళ సెల్వన్‌పై అనుమానం వచ్చి విచారించారు. ఇందులో తానే హత్య చేసి ఇంటి వెనుక భాగంలోని మరుగుదొడ్డి గుంటలో పడ వేసినట్లు అతను ఒప్పుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పెరియపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం నేరం ఒప్పుకున్న తమిళసెల్వన్‌ను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా తమిళసెల్వన్ మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అంతకు ముందే అదే గ్రామానికి చెందిన ఒక యువతిపై హత్యాయత్నం, లారీపై కిరోసిన్ పోసి నిప్పంటించినట్లు తెలిసింది.