‘‘కాలా బార్ బేరియన్’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ప్రజ్ఞన్ బాగా నటించాడని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగులోనూ మంచి సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు ఎన్. శంకర్ అన్నారు. ప్రజ్ఞన్, వరుణ్ సింగ్ రాజ్‌పుత్, స్థుతి చయనిక ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలా బార్ బేరియన్’(చాప్టర్ 1). జింటో చాకో శామ్యూల్ దర్శకత్వంలో పూణే ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందిన కొందరు విద్యార్థులు హిందీ, తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు.
పరుపాటి శ్రీనివాస రెడ్డి ఈ మూవీని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఎన్. శంకర్ రిలీజ్ చేశారు ‘‘ఈ సినిమాలో ఒక సైకో, మల్టీ పర్సనాలిటీ... ఇలా చాలా వేరియషన్స్ ఉన్న పాత్రలు చేశాను’’ అన్నారు ప్రజ్ఞన్. ఇతను తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన కుర్రాడు. నటన మీద ఆసక్తితో పుణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ లో శిక్షణ పొందాడు.
Comments
Please login to add a commentAdd a comment