Rashmika Mandanna, Amitabh Bachchan Goodbye Trailer Release - Sakshi
Sakshi News home page

Goodbye Trailer: అమితాబ్‌తో రష్మిక గొడవ.. ఆసక్తిగా ‘గుడ్‌బై’ ట్రైలర్‌

Published Tue, Sep 6 2022 6:23 PM | Last Updated on Tue, Sep 6 2022 7:14 PM

Rashmika Mandanna, Amitabh Bachchan Goodbye Trailer Release - Sakshi

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా బాలీవుడ్‌లో నటించిన లేటెస్ట్‌ మూవీ గుడ్‌బై. బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. మనిషి పోతే అంత్యక్రియలను వేడుకగా జరిపించాలనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్‌ చూస్తుంటే తెలుస్తోంది.

చదవండి: చై-సామ్‌ విడాకులపై సమంత తండ్రి ఏమోషనల్‌ పోస్ట్‌

ఇక ఇందులో అమితాబ్‌ తండ్రి పాత్రలో కనిపించగా.. రష్మిక కూతురిగా కనిపించింది. తల్లి పాత్రలో నటించిన నటి నీనా గుప్తా చావు, అంత్యక్రయల చూట్టు ఈ మూవీ తిరగనుంది. ఆమె అంత్యక్రయలకు రాకుండ విదేశాల్లో ఉన్న కొడుకులు తప్పించుకోవడం, తల్లి శవాన్ని ఇంట్లో ఉండగానే రష్మిక తండ్రితో గొడవ పడటం ఇలా పలు భావోద్వేగ సన్నివేశాలతో ట్రైలర్‌ను మలిచారు. పూర్తి ఫ్యామిలీ, ఎమోషనల్‌ డ్రామాగా ఉన్న ఈ ట్రైలర్‌ సాంతం ఆకట్టుకుంటోంది. కాగా వికాస్ బాహ్ల్ ద‌ర్వ‌కత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శోభా క‌పూర్, ఏక్తాక‌పూర్‌లు నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement