Shah Rukh Khan Thanks Vijay for Pathaan Tamil Trailer Launch - Sakshi
Sakshi News home page

Vijay-Shah Rukh Khan: అందుకే మీరు దళపతి అయ్యారు!: విజయ్‌పై షారుక్‌ ట్వీట్‌

Published Thu, Jan 12 2023 12:21 PM | Last Updated on Thu, Jan 12 2023 3:13 PM

Shah Rukh Khan Thanks Thalapathy Vijay After The Launch Pathaan Tamil Trailer - Sakshi

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయనకు సాధారణ ప్రజలే కాదు సినీ సెలెబ్రెటిల్లో సైతం అభిమానులు ఉన్నారు. రజనీకాంత్‌ తరువాత అంత ఫాలోయింగ్‌ ఉన్న నటుడు ఆయన. ఇప్పుడు విజయ్‌ని సూపర్‌స్టార్‌ అని అంటున్నారు కొందరు సినీ ప్రముఖులు. ఈ విషయాన్ని పక్కన పెడితే విజయ్‌ నటన గురించి మాత్రమే కాదు.. ఆయన ప్రవర్తన గురించి, ఇతరులకు ఇచ్చే గౌరవం గురించి అందరూ ప్రశంసించేవారే. ఇక అభిమానులకైతే విజయ్‌ ఆరాధ్య దైవం అనే చెప్పాలి. 

చదవండి: థ్యాంక్యూ శ్రీవల్లి.. వేదికపై భావోద్వేగానికి గురైన ఎంఎం కీరవాణి

విజయ్‌ మాట్లల్లో అర్థాలు వేరైనా, అవి చాలా సరళంగా ఉంటాయి. అలాంటి ఆయన గురించి బాలీవుడ్‌ బాద్‌షా షారూక్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. షారూక్‌ ఖాన్, దీపికా పడుకొనే జంటగా నటించిన చిత్రం బదాన్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రంపై షారూక్‌ ఖాన్‌ చాలా ఆశలు పెట్టుకున్నారనే చెప్పాలి. కారణం ఇంతకు ముందు ఈయన నటించిన కొన్ని చిత్రాలు నిరాశ పరిచాయి. అయితే బదాన్‌ చిత్రం పలు రకాలుగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో పఠాన్‌ చిత్రం హిందీతో పాటు, తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో విడుదల కానుంది.

చదవండి: థియేటర్లో బాలయ్య ఫ‍్యాన్స్ రచ్చ.. గెంటేసిన యాజమాన్యం

కాగా ఈ చిత్ర తమిళ వెర్షన్‌ ట్రైలర్‌ను ఇటీవల నటుడు విజయ్‌ ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేశారు. ఆయన ఇతర హీరోల చిత్రాల ట్రైలర్‌ను విడుదల చేయడం అన్నది ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో విజయ్‌ గురించి నటుడు షారూక్‌ ఖాన్‌ ట్వీట్‌ చేస్తూ చాలా ‘ధన్యవాదాలు మిత్రమా! ఈ మర్యాద కారణంగానే మీరు దళపతి అయ్యారు. త్వరలోనే పసందైన విందులో కలుసుకుందాం’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా విజయ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ వారీసు బుధవారం విడుదలైన బ్లాక్‌బస్టర్‌ హిట్‌టాక్‌ తెచ్చుకుంది. ఇదే మూవీ తెలుగులో వారసుడు పేరుతో జనవరి 14న విడుదల కానుంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement