ఇప్పుడు సౌత్‌పైనే అందరి దృష్టి.. ఆ స్టార్‌ హీరో విలన్ రోల్‌ చేస్తాడా.. ! | Amir Khan Will Act As A Villan Role In Vijay Upcomingh Movie | Sakshi
Sakshi News home page

Vijay: విలన్‌గా స్టార్‌ హీరో.. సౌత్‌పైనే ఎందుకంత ఆసక్తి!

Published Fri, Sep 8 2023 3:57 PM | Last Updated on Fri, Sep 8 2023 4:07 PM

Amir Khan Will Act As A Villan Role In Vijay Upcomingh Movie - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్స్ కన్ను సౌత్‌ ఇండస్ట్రీపై పడింది. అగ్రనటులు సైతం దక్షిణాదిలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. విలన్‌ క్యారెక్టర్‌లోనూ నటించేందుకు వెనుకాడడం లేదు. ఇప్పటికే సంజయ్‌దత్‌ శాండల్‌వుడ్‌ మూవీ కేజీఎఫ్‌–2లో విలన్‌గా నటించారు. నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ వివేగం చిత్రంలో అజిత్‌కు విలన్‌గా నటించారు.  అలాగే నటుడు జాకీష్రాఫ్‌ సైతం దక్షిణాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఒక ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. నటుడు విజయ్‌ లియో చిత్ర షూటింగ్‌ పూర్తిచేసి త్వరలోనే మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు.

(ఇది చదవండి: కిందపడ్డ ఎంగిలి మెతుకులు తిన్న రైతుబిడ్డ.. బయటేమో మరోలా..)

వెంకట్‌ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భారీ తారాగణం నటించబోతున్నట్లు కోలీవుడ్ టాక్. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లనున్నట్లు  తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు ఈ సంస్థ జయంరవి హీరోగా తనీఒరువన్‌- 2 చిత్రాన్ని నిర్మించనుంది. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహించనున్నారు. 

అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఓ న్యూస్ తెగ వైరలవుతోంది.  ఈ రెండు చిత్రాలలో ఒకదానిలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమీర్‌ఖాన్‌ను విలన్‌గా నటింపజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.  విజయ్‌కు విలన్‌గా అమీర్‌ఖాన్‌ను నటింపజేసే అవకాశం ఉన్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే ఇందులో నిజమెంతమనేది తెలియాల్సి ఉంది. అసలు ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరిస్తారా? అనేది గమనార్హం. అయితే లియో చిత్రంలో సంజయ్‌దత్‌ నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: 'జవాన్‌' సినిమాను నిలబెట్టిన ఈ ఆరుగురు.. ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఇవే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement