నాలుగవ చిత్రంతోనే పాన్ ఇండియా దర్శకుడు అయిపోయారు అట్లీ. దర్శకుడు శంకర్ శిష్యుడైన ఈయన రాజారాణి చిత్రంతో దర్శకుడిగా అవతారం ఎత్తారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత విజయ్ కథానాయకుడిగా మెర్సల్, బిగిల్ చిత్రాలు చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇక నాలుగో చిత్రంతోనే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి బాద్షా షారుక్ ఖాన్ కథానాయకుడిగా జవాన్ చిత్రాన్ని తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఐదవ చిత్రం ఏంటన్నదాని గురించే చర్చ జరుగుతోంది. ఈయనతో చిత్రాల చేయడానికి కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు క్యూలో ఉన్నారని చెప్పవచ్చు.
జవాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత షారుక్ ఖాన్ మళ్లీ అట్లీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అన్నారు. నటుడు విజయ్ కూడా షారుక్ ఖాన్ తో కలిసి నటించడానికి రెడీ అన్నారు. దీంతో వీరిద్దరిని కలిపి చిత్రం చేయడానికి కథను రెడీ చేస్తున్నట్లు అట్లీ ఇటీవల ఓ భేటీలో పేర్కొన్నారు. అలాంటిది అనూహ్యంగా ఈయన లోకనాయకుడు కమలహాసన్ కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నటుడు కమలహాసన్‌కు అట్లీ కథ చెప్పినట్లు ఆయన చాలా ఇంప్రెస్స్ అయినట్లు సమాచారం. అంతేకాకుండా కమలహాసన్ పారితోషికం తదితర విషయాలు గురించి చర్చ జరిగినట్లు, త్వరలోనే అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.
కాగా షారుక్ ఖాన్, విజయ్ కలిసి నటించిన చిత్రంలో కమలహాసన్ నటించనున్నారా? లేక అట్లీ దర్శకత్వంలో హాలీవుడ్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో కమలహాసన్ నటించనున్నారా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే కాగా కమలహాసన్ ప్రస్తుతం బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో లో హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరోపక్క చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇండియన్ 2 చిత్రాన్ని కంప్లీట్ చేసిన కమల్ ఇండియన్ –3 చిత్రానికి సిద్ధమవుతున్నారు.
తెలుగులో నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న కల్కి 2898ఏడీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఈయన ప్రతి నాయకుడిగా పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు టాక్ స్వెడ్ అయింది. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో అమితాబచ్చన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కాగా హెచ్ వినోద్ దర్శకత్వంలో తన 233 చిత్రంలో, మణిరత్నం దర్శకత్వంలో తన 234వ చిత్రంలోనూ నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా అట్లీ దర్శకత్వంలో నటించే విషయం నిజమైతే అది కమలహాసన్ 235వ చిత్రం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment