చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నాడని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఘాటుగా విమర్శించారు.
బాబుకు రామచంద్రయ్య సూచన
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు సైకోలా ప్రవర్తిస్తున్నాడని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఘాటుగా విమర్శించారు. ఎవరైనా చనిపోతే ఆ వ్యక్తి పేరిట ప్రభుత్వ పథకాల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోందని, అయితే ప్రస్తుతం ఆయన బతికుండగానే చంద్రన్న కానుక, చంద్రన్న తోఫా, చంద్రన్న బీమా ఇలా ప్రతి పథకానికి చంద్రబాబు పేరు పెట్టుకోవడం శోచనీయమన్నారు. ఇలా సంక్షేమ పథకాలకు పేర్లు పెట్టుకున్న ఆయన.. ఇలాగే ముఖ్యమంత్రి ఫిరాయింపుల పథకం, చంద్రబాబు అవినీతి పథకం లాంటి పేర్లు పెట్టుకుంటే బాగుంటుందని సూచించారు. అవినీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పీకల్లోతు కూరుకొనిపోయాడని, అందుకే ఆయన్ను కేంద్ర ప్రభుత్వం లెక్క చేయడం లేదని ఆరోపించారు. సోమవారం ఇందిర భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.