సైకో సంచారం... ఆందోళనలో జనం | Psycho worried people wandering ... | Sakshi
Sakshi News home page

సైకో సంచారం... ఆందోళనలో జనం

Mar 5 2014 2:25 AM | Updated on Sep 2 2017 4:21 AM

నగరంలోని పద్మావతి పు రంలో సైకో వీధుల్లో తిరుగుతూ స్థానికులపై దాడికి య త్నించడంతో వారు భయాందోళన చెందుతున్నారు.

 తిరుచానూరు  నగరంలోని పద్మావతి పు రంలో సైకో వీధుల్లో తిరుగుతూ స్థానికులపై దాడికి య త్నించడంతో వారు భయాందోళన చెందుతున్నారు. ప ద్మావతి పురంలోని 4,5 వార్డుల్లో మంగళవారం మధ్యాహ్నం ఓ గుర్తుతెలియనివ్యక్తి శరీరంపై గాట్లు పెట్టుకుని, రక్తం కార్చుకుంటూ ఆర్థిక సాయం చేయండి, ఆస్పత్రికి వెళ్లాలని తమిళంలో మాట్లాడుతూ తిరిగాడు.

 

లేదు పొమ్మన్న స్థానికులపై తిరగబడి దాడికి యత్నించాడు. దీంతో 5 వార్డులో జనం గుమికూడి ఏకంగా అతడిని అక్కడి నుంచి తరిమివేశారు. దీంతో అతడు నాలుగో వార్డులోకి వెళ్లి అక్కడ కూడా స్థానికులపై దాడికి యత్నించాడు. దీంతో స్థానికులు అతడు ఎవరని విచారించగా అతడో ఉన్మాది అని, ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు స్పందించి, గుర్తుతెలియని వ్యక్తుల సంచారంపై నిఘా పెంచి, తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement