Tirucanuru
-
శ్రీవారి చలవతో నీటికష్టాలు తీరాయి: గవర్నర్
తిరుమలలో భారీ వర్షాలు కురిసి, జలాశయాలు కళకళలాడటానికి ఏడు కొండల వాడి దయే కారణం అని గవర్నర్ నరసింహన్ అన్నారు. శ్రీవారి సన్నిధిలో భక్తులకు ఈ ఏడాది నీటి కష్టాలు తప్పినట్లే అని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం ఆయన తిరుచానూర్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వరుడి దయతోనే చిత్తూరు జిల్లాలో మంచి వర్షాలు కురిసి, రైతుల కష్టాలు తీరాయని చెప్పారు. ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి తిరుచానూర్‌లో అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వేదిక్ యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొంటారు. -
వైభవంగా అవతారోత్సవాలు
పెద్దశేషునిపై సుందరరాజ స్వామి దివ్యదర్శనం తిరుచానూరు : పద్మావతీ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన సుందరరాజ స్వామి వారి వార్షిక అవతారోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు రాత్రి స్వామి వారు పెద్దశేషవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. ప్రతి ఏటా జ్యేష్టమాసంలో వచ్చే ఉత్తరాభాద్ర నక్షత్రం ముగిసే సమయానికి స్వామివారికి మూ డు రోజుల పాటు అవతారోత్సవాలు నిర్వహిసా ్తరు. అవతారోత్సవాల్లో భాగంగా స్వామివారిని వేకువనే సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారినిఆలయ ముఖమండపడంలోకి వేంచేపు చేసి, కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదపారాయణం నడుమ ఉభయదేవేర్లతో సహా స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో అభిషేకించారు. సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారికి ఊంజల్‌సేవను కన్నులపండువగా నిర్వహించారు. రాత్రి 7.15 గంటలకు స్వామి వారిని వాహన మండపంలోకి వేంచేపు చేసి, పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం దివ్యాలంకార శోభితుడైన స్వామి వారు ఉభయదేవేర్లతో సహా పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శనం కల్పించారు. అవతారోత్సవాల్లో నేడు అవతారోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు అభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, రాత్రి 7.15 గంటలకు హనుమంత వాహన సేవ జరుగుతుంది. -
వైభవంగా అవతారోత్సవాలు ప్రారంభం
పెద్దశేషునిపై సుందరరాజస్వామి దర్శనం తిరుచానూరు: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువైన సుందరరాజస్వా మి వార్షిక అవతారోత్సవాలు బుధవా రం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించే అవతారోత్సవాల్లో మొదటి రోజైన బుధవారం రాత్రి స్వామి వారు పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. అవతారోత్సవాల్లో భాగంగా స్వామిని వేకువనే సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామిని వేంచేపుగా ఆలయ ముఖమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదపారాయణం నడుమ ఉభయదేవేరులతో సహా స్వా మిని అభిషేకించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామికి ఊంజల్‌సేవ కన్నులపండువగా నిర్వహించారు. రాత్రి 7.15 గంట లకు స్వామిని వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి పెద్దశేష వాహనం పై కొలువుదీర్చారు. అనంతరం దివ్యాలంకార శోభితుడైన స్వామి ఉభయదేవేరులతో సహా పెద్దశేష వాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దివ్యదర్శ నం కల్పించారు. సుందరరాజస్వామి అ వతారోత్సవాల్లో భాగంగా రెండవ రోజై న గురువారం రాత్రి 7.15 గంటలకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం 2 గంటలకు అభిషేకం, సాయంత్రం 5 గంటలకు ఊంజల్‌సేవ జరుగుతాయి. -
వైభవంగా అమ్మవారి తెప్పోత్సవాలు
తొలిరోజు తెప్పపై విహరించిన శ్రీకృష్ణుడు నేత్రపర్వంగా అభిషేకం తిరుచానూరు, న్యూస్‌లైన్: తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో తొలిరోజు రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి పుష్కరిణిలో తెప్పపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా స్వామిని తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు స్వామిని సన్నిధి నుంచి వేంచేపుగా శ్రీకృష్ణస్వామి ముఖమండపానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అనంతరం వేదపారాయణం, మంగళవాయిద్యాల నడుమ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఆలయ అర్చకులు నేత్రపర్వంగాఅభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఉభయదేవేరులతో సహా స్వామిని వేంచేపుగా ఆలయం నుంచి అమ్మవారి పుష్కరిణికి తీసుకొచ్చి తెప్పపై కొలువుదీర్చారు. అనంతరం సర్వాంగ శోభితుడైన స్వామి ఉభయదేవేరులతో సహా తెప్పపై కొలువై మూడు పర్యాయాలు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి 7.30 గంటలకు తిరుచ్చిపై తిరువీధుల్లో ఊరేగారు. ఆయాకార్యక్రమాల్లో ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు కేపీ.వెంకటరత్నం, ధర్మయ్య, ఆర్జితం, ప్రసాదం ఇన్స్పెక్టర్లు గురవయ్య, ఆంజనేయులు, ఏవీఎస్వో రామకృష్ణ, వీఐ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. తెప్పోత్సవాల్లో నేడు తెప్పోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం 3గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత సుందరరాజస్వామికిఅభిషేకం, సాయంత్రం 6.30 గంటలకు తెప్పోత్సవం, రాత్రి 7.30 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగుతాయి. -
లక్ష్మీకాసుల హారం దొరికిందట!
తిరుచానూరు, న్యూస్‌లైన్: మూడు రోజుల క్రితం మాయమైన తిరుచానూరు పద్మావతి అమ్మవారి లక్ష్మీకాసుల హారం శుక్రవారం ప్రత్యక్ష మైంది. ఆలయంలోని గర్భగుడిలోనే ఉందని అర్చకులు వెల్లడించారు. పద్మావతి అమ్మవారి మూలమూర్తికి కవచాలు, హస్తాలు, కాసులహారం, మంగళసూత్రం వంటి దాదాపు 18 రకాల బంగారు ఆభరణాలు నిత్య అలంకరణగా వాడతారు. ప్రతి శుక్రవారం అమ్మవారి మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. ఆ సమయంలో మాత్రమే ఈ ఆభరణాలను తీసి గర్భగుడిలోనే ఉన్న నగల పెట్టెలో భద్రపరుస్తారు. ఈనెల 13 నుంచి జరగనున్న వసంతోత్సవాల సందర్భంగా 6వ తేదీ ఉదయం ఆలయంలో కోయిల్ఆళ్వార్ తిరుమంజన సేవ నిర్వహించారు. ఆ సమయంలో అమ్మవారి నగలన్నిం టినీ తీసి పెట్టెలో భద్రపరిచారు. ఆరోజు సాయంత్రం అమ్మవారి లక్ష్మీకాసుల హారం మాయమైనట్టు అర్చకులు గుర్తించి అధికారులకు సమాచారం చేరవేశారు. గురువారం ఈ విషయం బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గర్భాలయాన్ని శుద్ధి చేశాక, నీరు వెళ్లే తూములో హారం ఇరుక్కు పోయిందని అర్చకులు చెబుతున్నారు. కాగా, ఈ వ్యవహారం పై టీటీడీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించి నట్టు తెలిసింది. -
సైకో సంచారం... ఆందోళనలో జనం
తిరుచానూరు నగరంలోని పద్మావతి పు రంలో సైకో వీధుల్లో తిరుగుతూ స్థానికులపై దాడికి య త్నించడంతో వారు భయాందోళన చెందుతున్నారు. ప ద్మావతి పురంలోని 4,5 వార్డుల్లో మంగళవారం మధ్యాహ్నం ఓ గుర్తుతెలియనివ్యక్తి శరీరంపై గాట్లు పెట్టుకుని, రక్తం కార్చుకుంటూ ఆర్థిక సాయం చేయండి, ఆస్పత్రికి వెళ్లాలని తమిళంలో మాట్లాడుతూ తిరిగాడు. లేదు పొమ్మన్న స్థానికులపై తిరగబడి దాడికి యత్నించాడు. దీంతో 5 వార్డులో జనం గుమికూడి ఏకంగా అతడిని అక్కడి నుంచి తరిమివేశారు. దీంతో అతడు నాలుగో వార్డులోకి వెళ్లి అక్కడ కూడా స్థానికులపై దాడికి యత్నించాడు. దీంతో స్థానికులు అతడు ఎవరని విచారించగా అతడో ఉన్మాది అని, ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు స్పందించి, గుర్తుతెలియని వ్యక్తుల సంచారంపై నిఘా పెంచి, తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు. -
తిరుచానూరు పంచాయతీ ఆదాయానికి గండి
తిరుచానూరు, న్యూస్‌లైన్: తిరుచానూరు గ్రామ పంచాయతీ ఆదాయానికి అధికారులు భారీగా గండి కొడుతున్నారు. రోజురోజుకి విస్తరిస్తుండడంతో అధిక సంఖ్య లో కల్యాణమండపాలు, షాపింగ్ కాంప్లెక్సులు, అపార్ట్మెంట్లు తిరుచానూరు పంచాయతీ పరిధిలో వెలుస్తున్నాయి. తిరుచానూరులో సుమారు 40వరకు కల్యాణమండపాలున్నాయి. అయితే 27కల్యాణమండపాల నుంచే పన్నులు వసూలు చేస్తున్నారని తెలిసింది. వాస్తవానికి భిన్నంగా తక్కువ విస్తీర్ణాన్ని నమోదు చేసి, అందుకు తగ్గట్టుగా తక్కువ మొత్తాన్ని పన్ను రూపంలో వసూలు చేస్తున్నట్లు సమాచారం.అదే విధంగా ఒక కళాశాలకు కూడా పన్నులో భారీ మినహాయింపు ఇచ్చినట్టు తెలిసింది. ఒక్క కల్యాణమండపాలే కాకుండా షాపింగ్ కాంప్లెక్స్, అపార్ట్మెంట్లు నుంచి తక్కువ మొత్తాన్నే పన్ను రూపంలో వసూలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. చక్రం తిప్పుతున్న చిన్న స్థాయి ఉద్యోగి పంచాయతీ విస్తరించడంతో ఇంటి, నీటి తదితర పన్నుల వసూలుకు బిల్‌కలెక్టర్‌కు సహాయకులుగా ఆరుగురిని కాంట్రాక్టు ప్రాతిపదికన బిల్‌కలెక్టర్లుగా నియమించారు. ఇంటింటికి వెళ్లి పన్నులు వసూలు చేయాల్సిన పర్మినెంట్ బిల్‌కలెక్టర్ మాత్రం ఆఫీసులోనే కూర్చుని జూనియర్ అసిస్టెంట్ చేయాల్సిన పనులను చేస్తూ సహద్యోగులపై పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదేళ్లకు పైగా ఇక్కడే విధులు నిర్వహిస్తుండడంతో ఇక్కడున్న లొసుగులన్నింటిని తెలుసుకున్న ఆ ఉద్యోగి చక్రం తిప్పుతూ అవినీతికి పాల్పడుతున్నట్లు స్థానికులే కాకుండా అక్కడ పనిచేసే సిబ్బంది వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బంది కోరుతున్నారు. చర్యలు తీసుకుంటా తిరుచానూరులోని అన్ని కల్యాణమండపాల నుంచి డాక్యుమెంట్ ప్రకారమే పన్నును వసూలు చేస్తున్నాం. అవకతవకలు తమ దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాను. ఇప్పుడున్న బిల్‌కలెక్టర్‌కు సాంకేతిక అనుభవం ఉండడంతో అతన్ని ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నామని ఈవో జనార్దనరెడ్డి చెప్పారు. -
కల్పవృక్షమెక్కి..కరుణించిన తల్లి
తిరుచానూరు, న్యూస్‌లైన్: పద్మావతీదేవి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజైన సోమవారం ఉదయం రాజగోపాలుని అలంకరణలో అమ్మవారు కోర్కెలను తీర్చే కల్పవృక్ష వాహనంపై తిరువీధు ల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువనే 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు అమ్మవారిని ఆలయంలోని అద్దాలమండపం నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి అక్కడే సిద్ధంగా ఉంచిన కల్పవృక్షవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారిని పట్టుపీతాంబర, స్వర్ణాభరణాలతో పాటు ఎడమ చేతిలో రాజదండం, కుడి చేతిలో చర్నాకోల చేతబట్టి గోవుల ను పాలించే రాజగోపాలునిగా అలంకరించారు. అనంతరం 8గంటలకు జియ్యర్ల ప్రబంధ పారాయణం, మంగళ వాయిద్యాలు, చిన్నారుల కోలాటం, దాససాహితీ భజన బృందం, కళాకారుల నృత్య ప్రదర్శన, భక్తుల గోవింద నామ స్మరణ నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. రాత్రి అమ్మవారు హనుమంత వాహనంపై రాముని అవతారంలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ వాహనసేవల్లో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో భాస్కర్‌రెడ్డి, ఏఈవో నాగరత్న పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అమ్మవారికి మంగళవారం వసంతోత్సవం నిర్వహించనున్నారు. -
ఆకట్టుకుంటున్న ఫలపుష్ప ప్రదర్శన
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఉద్యానవనంలో టీటీడీ ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రదర్శనశాల ను శుక్రవారం టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో పోలా భాస్కర్ ప్రారంభించారు. అనంతరం అక్కడున్న పురాణాలకు సంబంధించిన కళాకండాలు, కూరగాయలతో రూపొందించిన బొమ్మలను ఆసక్తిగా తిలకించారు.