శ్రీవారి చలవతో నీటికష్టాలు తీరాయి: గవర్నర్ | Governor in tirucanuru | Sakshi
Sakshi News home page

శ్రీవారి చలవతో నీటికష్టాలు తీరాయి: గవర్నర్

Published Wed, Nov 18 2015 1:07 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM

Governor in tirucanuru

తిరుమలలో భారీ వర్షాలు కురిసి, జలాశయాలు కళకళలాడటానికి ఏడు కొండల వాడి దయే కారణం అని గవర్నర్ నరసింహన్ అన్నారు. శ్రీవారి సన్నిధిలో భక్తులకు ఈ ఏడాది నీటి కష్టాలు తప్పినట్లే అని ఆయన చెప్పారు. బుధవారం ఉదయం ఆయన తిరుచానూర్ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.

వెంకటేశ్వరుడి దయతోనే చిత్తూరు జిల్లాలో మంచి వర్షాలు కురిసి, రైతుల కష్టాలు తీరాయని చెప్పారు. ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయన అక్కడి నుంచి తిరుచానూర్‌లో అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వేదిక్ యూనివర్సిటీ కాన్వకేషన్ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ పాల్గొంటారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement