
సాక్షి, తిరుమల: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. రెండు రోజుల కిందట రెండో ఘాట్‌రోడ్డులో చిరుత రోడ్డును దాటుతుండగా భక్తులు సెల్ ఫోన్లో చిత్రీకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆదివారం మొదటి ఘాట్ రోడ్డులో చిరుత రోడ్డుకు పక్కనే ఉన్న చెట్టుకింద జింకల కోసం వేచి ఉంది.
ఘాట్ రోడ్డులో వాహనాల్లో ప్రయాణిస్తున్న భక్తులు చిరుతను తమ సెల్‌ఫోన్లో చిత్రీకరించారు. సాధారణంగా ఈ మార్గంలో భక్తులు రోడ్డు పక్కన ఉన్న జింకలకు ఆహారాన్ని అందిస్తుంటారు. అదే సమయంలో ఆహారం కోసం చిరుత ఘాట్ రోడ్డు పక్కకు వస్తోంది. తరచూ చిరుతలు ఇక్కడ కనిపిస్తుండడంతో భక్తులు భయపడిపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment