
( ఫైల్ ఫోటో )
సాక్షి, తిరుమల: తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంట్లు సంచారం కలకలం రేపాయి. ట్రాప్ కెమెరాల్లో చిరుత, ఎలుగుబంట్ల కదలికలు నమోదయ్యాయి. గడచిన నెల రోజుల్లో రెండు రోజులు ట్రాప్ కెమెరాలో కదలికలు నమోదయ్యాయి. డిసెంబర్ 13, 29 తేదీల్లో ట్రాప్ కెమెరాకు చిరుత చిక్కింది. చిరుతతో పాటు ఎలుగుబంట్లు కదలికలు అధికారులు గుర్తించారు. ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
నడకమార్గంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా రావాలంటూ టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. నడకమార్గం పక్కనున్న అటవీ ప్రాంతంలో చిరుత సంచరించడంతో భక్తులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అవి తిరుగుతున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డ్ అయినట్లు పేర్కొన్నారు. టీటీడీ ఈవోకు ఫారెస్ట్ అధికారులు సమాచారం అందించారు.
ఇదీ చదవండి: కృష్ణానది ఒడ్డున కలకలం.. అర్ధరాత్రి క్షుద్ర పూజలు!
Comments
Please login to add a commentAdd a comment