( ఫైల్ ఫోటో )
సాక్షి, తిరుపతి: తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేగింది. అలిపిరి మార్గంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ చిక్కింది. చిన్నారి అక్షితపై దాడి చేసి చంపిన స్థలంలోనే చిరుత సంచరించినట్లు తెలుస్తోంది.
శేషాచలం కొండల్లో ఆపరేషన్ చిరుత పేరుతో నాలుగు చిరుతలను అధికారులు బంధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో చిరుత సంచారం ఆందోళన రేకెత్తిస్తోంది. చిరుతను బంధించేందుకు బోనులు ఏర్పాటు చేశారు అధికారులు.
Comments
Please login to add a commentAdd a comment