తిరుమల : దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆగస్టు 22 నుండి 26వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలను నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం.
దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు పడాలని, దేశమంతటా శాంతిని కాంక్షిస్తూ నేటి నుంచి తిరుమలలో కారీరిష్టి, వరుణ, పర్జన్య శాంతి యాగాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించనుంది. ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే యాగ క్రతువు ఆరు రోజుల పాటు కొనసాగి, 26వ తేదీన తిరుమలలోని శ్రీవారి పుష్కరిణిలో జరిగే అవబృదేష్టితో ముగుస్తుంది.
తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహించనుండగా 32 మంది వేద, శ్రౌత, స్మార్థపండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆగస్టు 26న మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు.
ఈ ఉత్సవాల్లో భాగంగా ధర్మగిరిలో మూడ్రోజులు వరుణజపం నిర్వహించనున్నారు అర్చకులు. ఈనెల 26న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేసి 27 నుంచి మూడ్రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఆన్‌లైన్‌లో టికెట్లు..
ఈ యాగాలు పూర్తయ్యాక వచ్చేనెల తితిదేలో సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వాటిని అనుసరిస్తూ అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక నవంబర్ నెలలో జరగనున్న కార్యక్రమాలకు నేడే ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేయనున్నారు. ఉ.10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవా, సహస్ర దీపాలంకరణ టికెట్లు విడుదల చేయనున్నారు.
ఇది కూడా చదవండి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Comments
Please login to add a commentAdd a comment