తిరుమల: కలియుగ వైకుంఠం తిరుమలలో చిరుత పులులు కలకలం రేపాయి. ఒకటి అంతకు మించి చిరుతపులులు సోమవారం రాత్రి కొండపైనున్న నర్సింగ్ సదన్ అతిథి గృహంలోకి ప్రవేశించాయి. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
సిబ్బంది ఇచ్చిన సమాచారంతో టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు నర్సింగ్ సదన్ వద్దకు చేరుకున్నారు. సెక్యూరిటీ విభాగాల సిబ్బంది పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని పులిని బంధించే యత్నం చేస్తున్నారు. కాగా, అటవీ శాఖ సిబ్బంది ఇంకా అక్కడికి చేరుకోకపోవడం గమనార్హం. భక్తులంతా తమ గదుల్లోనే ఉండాలని, బయట సంచరించరాదని జేఈవో సూచించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది.
తిరుమల అతిథి గృహంలో చిరుత కలకలం
Published Mon, Jul 25 2016 9:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
Advertisement
Advertisement