తిరుమల: తిరుమల: తిరుమల నడకదారిలో బుధవారం ఉదయం మరో చిరుత చిక్కింది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన తర్వాత మరింత అప్రమత్తమైన టీటీడీ.. చిరుతల దాడిని నియంత్రించేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఆ చర్యలు సత్ఫలితాల్ని ఇవ్వడంతో తిరుమల నడకదారిలో ఆరవ చిరుతను బంధించారు.
ఈ మేరకు చిరుత చిక్కిన ప్రాంతానికి వచ్చిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘చిన్నారి లక్షిత పై దాడి చేసాక టీటీడీ అనేక చర్యలు చేపట్టింది. నడకదారి భక్తులకు భద్రత కట్టుదిట్టం చేశాం. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సూచనలు అన్ని అమలు చేస్తున్నాం. నడకదారిలో భక్తులకు కర్రలు అందించాము. భవిష్యత్తులో మరింత భద్రత కల్పిస్తాము. నడకదారిలో కంచె వెయ్యడామా.. లేక జంతువుల సంచారానికి మార్గం సుగమం చెయ్యడానికి ఏర్పాటు చేస్తాము. విమర్శలు చేసే వారికి కనువిప్పు కలగాలి. టీటీడీ చేపట్టిన చర్యల కారణంగానే ఆరవ చిరుతను బంధించాము. క్రూరమృగాల సంచారం పై నిరంతరం అధ్యయనం జరుగుతుంది’ అని అన్నారు.
కాగా, నడకదారిలో చిక్కిన చిరుతను అటవశాఖ అధికారులు జూపార్క్‌కి తరలించారు. దీనిపై డీఎఫ్‌వో మాట్లాడుతూ.. ‘ వేకుమజామున చిరుత బోన్‌లో చిక్కింది. సుమారు నాలుగు సంవత్సరాల వయస్సు ఉంటుంది. వైద్య పరీక్షల అనంతరం చిరుతను సుదూర అటవీప్రాంతంలో వదలాలా లేదా అన్నది నిర్ణయిస్తాము. బోన్ లో చిక్కిన ఆరు చిరుతలలో రెండు మూడు చిరుతలకు దంతాలు సరిగ్గలేవు. వాటికి వేటడే శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి వాటిని జూపార్క్ సంరక్షణ చేస్తాం’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment